బోయపాటికి జర్క్ ఇచ్చిన బాలయ్య..!

నిన్న బోయపాటి శ్రీను పుట్టినరోజు కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమా అప్ డేట్ కోసం వెయిట్ చేసారు. కానీ సీన్ రివర్స్ [more]

Update: 2019-04-26 13:06 GMT

నిన్న బోయపాటి శ్రీను పుట్టినరోజు కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమా అప్ డేట్ కోసం వెయిట్ చేసారు. కానీ సీన్ రివర్స్ అయింది. బాలయ్య ఊహించని విధంగా బోయపాటికి షాక్ ఇచ్చాడు. బోయపాటి పుట్టినరోజు నాడు తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశాడు బాలయ్య. మరోసారి కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలకృష్ణ. ఈ మూవీ మేలో ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. దీన్ని కూడా నిర్మాత సి.కల్యాణ్ నిర్మించనున్నారు. గతంలో వీరి కాంబినేషన్ వచ్చిన ‘జైసింహా’ పర్లేదు అనిపించుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్ యధాతథంగా రిపీట్ కాబోతోంది. అంటే బోయపాటితో బాలయ్య సినిమా లేనట్టే అని అర్ధం అయింది .

బోయపాటిని సైడ్ చేశారా..?

నిజానికి బోయపాటితో సినిమా అని కథానాయకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే అనౌన్స్ చేసాడు బాలయ్య. బోయపాటి కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా రెడీగా ఉందన్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు బోయపాటి ప్లేస్ లోకి కేఎస్ రవికుమార్ వచ్చి చేరాడు. మరి ఇదంతా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్ధం కావట్లేదు. ‘వినయ విధేయ రామ’ సినిమా డిజాస్టర్ అవ్వడమే కారణం అంటున్నారు చాలామంది. కానీ అందులో నిజం లేదు ఎందుకంటే బోయపాటి కంటే పెద్ద డిజాస్టర్లు తీసిన దర్శకులకే బాలయ్య వెంటవెంటనే అవకాశాలిచ్చాడు. ఇదంతా తప్పు. వేరే కారణం ఉండి ఉండవచ్చు అంటున్నారు.

Tags:    

Similar News