ఈసారి ముహూర్తం పక్కా అంటున్నారు!

Update: 2018-05-21 13:02 GMT

బాలకృష్ణ - బోయపాటి కాంబో లో ఎలాంటి సినిమాలొచ్చాయో, అవెంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి కాంబోలో రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాక కూడా మూడో ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ఏళ్ళు పట్టింది. అయినా బాలయ్య - బోయపాటి సినిమా మీద స్పష్టత లేదు. అదిగో ఇదిగో బాలయ్య- బోయపాటి కాంబో మూవీ సెట్స్ మీదకొస్తుందనే న్యూస్ లు తప్ప అటు బాలయ్య మాత్రం బోయపాటి మూవీపై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ బోయపాటి మాత్రం బాలయ్య అవకాశం ఎప్పుడిస్తాడా అని తెగ ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా బోయపాటి - బాలయ్య సినిమాకి ముహూర్తం ముందుంది అంటున్నారు.

త్వరలోనే అధికారిక ప్రకటన....

బాలకృష్ణ - బోయపాటి శ్రీను ల సినిమా పూజా కార్యక్రమాలను వచ్చేనెల మొదటివారంలో జరపాలనే నిర్ణయానికి వీరిద్దరూ వచ్చినట్టుగా సమాచారం. మరి సినిమా పూజ కార్యక్రమాలను ఇప్పుడు జరిపించినా ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తోపాటుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా చేస్తున్న సినిమాలు పూర్తయ్యాకే బోయపాటితో బాలయ్య సినిమా సెట్స్ మీదకెళుతుందట. ఆ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాకే బాలకృష్ణ బోయపాటితో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. అయితే బాలకృష్ణ - బోయపాటి సినిమాపై అతి తొందరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు.

Similar News