బాలయ్య ఫ్యాన్స్ కూల్ అవ్వండి

బాలకృష్ణ – బోయపాటి సినిమా ఆగిపోయింది, BB3 కి బడ్జెట్ ప్రోబ్లెంస్, బాలయ్యకి హీరోయిన్ ప్రోబ్లెంస్ అంటూ వార్తలు వండి వార్చిన వెబ్ మీడియాకి షాకిచ్చేలా బాలయ్య [more]

Update: 2020-12-23 07:49 GMT

బాలకృష్ణ – బోయపాటి సినిమా ఆగిపోయింది, BB3 కి బడ్జెట్ ప్రోబ్లెంస్, బాలయ్యకి హీరోయిన్ ప్రోబ్లెంస్ అంటూ వార్తలు వండి వార్చిన వెబ్ మీడియాకి షాకిచ్చేలా బాలయ్య – బోయపాటి సినిమా లొకేషన్స్ లో తెలంగాణ యూత్ బాలయ్య ని మీట్ అయ్యి సత్కరించడంతో BB3 పై బాలయ్య అభిమానుల్లో ఉన్న అనుమలన్నీ పటాపంచలయ్యాయి. బాలయ్య ని BB3 సెట్స్ లో చూసిన బాలయ్య ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం మొదలయ్యింది. తెలంగాణ తెలుగు యువత బాలయ్యని కలిసేందుకు BB3 సెట్స్ కి వెళ్లిన ఫొటోస్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అలాగే BB3 స్పాట్ లో బాలయ్య బాబు లుక్ చూసి ఫ్యాన్స్ మైమరచిపోయారు. ఫొటోస్ లో ధవళ వస్త్రాల్లో ధగ ధగ మెరిసిపోతున్న బాలయ్యను చూసి తెగ మురిసిపోతున్నారు అభిమానులు. బోయపాటి సినిమాల్లో బాలయ్య లుక్ ఎప్పుడూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనేది అభిమానుల అంచనా. దాన్ని నిజం చేసేలా అద్భుతంగా ఉన్న బాలయ్య BB3 లుక్ బాలయ్య బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

Tags:    

Similar News