బాలయ్య – బోయపాటి జోనర్ ఏంటో తెలుసా..?

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. రెండు తరాలకు చెందిన పాత్రల్లో బాలకృష్ణ నటిస్తున్నట్టు [more]

Update: 2019-02-15 08:09 GMT

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. రెండు తరాలకు చెందిన పాత్రల్లో బాలకృష్ణ నటిస్తున్నట్టు టాక్. 30 ఏళ్ళ క్రితం జరిగిన కథలో ఓ పాత్ర.. ప్రస్తుతం జరుగుతున్న కథలో మరొక పాత్రగా నటించనున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నట్టు టాక్. ఇక హీరోయిన్స్ ని కూడా సెలెక్ట్ చేసే పనిలో ఉన్న బోయపాటి ఉన్నాడు. ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఈ నెల మూడో వారంలో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.

రాజకీయ నేపథ్యంతో…

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా చాలావరకు రాజకీయ నేపథ్యంతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా, బోయపాటి మార్క్ స్టైల్ లో ఉండబోతుందని సమాచారం. అలాగే ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు టాక్.

Tags:    

Similar News