బాలయ్య - బోయపాటి ఫిక్స్

Update: 2018-12-21 17:57 GMT

బాలకృష్ణ -బోయపాటి హ్యాట్రిక్ మూవీ టైం ఫిక్స్ అయ్యింది. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక మీద నందమూరి అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ బాలకృష్ణ తన ఓన్ బ్యానర్ ఎన్ బీ కే బ్యానర్ లోనే బోయపాటి సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎన్ బీ కే ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా బాలయ్య - బోయపాటిల చిత్రం ఫిబ్రవరి 2020 నుండిమొదలవబోతున్నట్లుగా ఆఫీసియల్ గా ప్రకటించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ హడావిడిలో ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా జనవరి 9 న మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 7 న విడుదల కాబోతున్నాయి. ఇక ఆ సినిమాల తర్వాత వినాయక్ తో బాలయ్య సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వస్తున్న వార్తలకు బాలయ్య - బోయపాటి లు కంబైన్డ్ గా ఫుల్ స్టాప్ పెట్టేసారు.

ఇక బోయపాటి తో బాలయ్య మూవీ ఎనౌన్సమెంట్ జరగగానే ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో స్టేజ్ మీదకెక్కిన బోయపాటి మొహం 1000 కేండిల్స్ బల్బులా వెలిగిపోయింది. ఇక ఆనందంలో ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడిన బోయపాటి ఎన్టీఆర్ బయోపిక్ ని త్వరగా పూర్తి చేసిన క్రిష్ కి కృతఙ్ఞతలు చెప్పి.. బాలయ్య తన కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలకన్నా ఒక పది శాతం ఎక్కువున్న సినిమానే అందించడానికి కష్టపడతానని.. ఫిబ్రవరిలో మొదలవ్వబోయే సినిమా గురించి అప్పుడే అన్ని విషయాలు వెల్లడిస్తామని.. అంటే ఆ సినిమా నటీనటులు, రెగ్యులర్ షూటింగ్ వివరాలు అందిస్తామని చెప్పాడు. ఇక బాలయ్య బాబు ఎన్టీఆర్ పాత్ర చెయ్యడం మాత్రం చాల అరుదైన ఘటనగా బోయపాటి పేర్కొన్నాడు

Similar News