బొబ్బిలి పులిగా బాలయ్య అదరగొట్టేసాడట..!

Update: 2018-11-10 07:07 GMT

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో కథానాయకుడు, మహానాయకుడు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు క్రిష్ ఎలాంటి విరామం తీసుకోకుండా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ 66 గెటప్స్ లో కనబడనున్నాడనే ప్రచారం జరిగినట్టుగానే... కథానాయకుడిగా బాలకృష్ణ అనేక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. ఎన్టీఆర్ క్లాసిక్ హిట్స్ అయిన వేటగాడు, మిస్సమ్మ, గుండ‌మ్మ కథ, మేజర్ చంద్రకాంత్ లో అల్లూరి సీతారామరాజు గెటప్, అలాగే తాజాగా బొబ్బిలిపులి.. ఇంకా చాలా గెటప్స్ లో బాలకృష్ణ ఇరగదీస్తున్నాడట.

బొబ్బిలి పులి గెటప్ లో బాలయ్య

ఇప్పటికే ఎన్టీఆర్ లుక్స్ లో బాలకృష్ణ అదరగొడుతుంటే.. ఇప్పుడు బొబ్బిలి పులి గెటప్ లో బాలయ్య వీర విహారం చేస్తున్నాడట. దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బొబ్బిలి పులి సినిమాలో కోర్టులో ఎన్టీఆర్... కోర్టు కోర్టుకీ, తీర్పు తీర్పుకీ ఇంత మార్పా అంటూ న్యాయ వ్య‌వ‌స్థ‌ని ప్ర‌శ్నించిన తీరు.. అప్పట్లో థియేట‌ర్ల‌ని ద‌ద్ద‌రిల్లేలా చేసింది. ఆ సినిమాలో ఆ సీన్ చాలా హైలెట్. అలంటి సీన్స్ ఇప్పుడు ఎన్టీఆర్‌ కథానాయకుడు లోనూ ఉందట. మరి ఎన్టీఆర్ ఎలాంటి హావభావాలతో. ఆ సీన్ లో అదరగొట్టాడో.. ఇప్పుడు అదే సీన్ లో బాలయ్య రెచ్చిపోయి నటిస్తున్నాడని అంటున్నారు.

సింగిల్ టేక్ లో...

మరి అలంటి గొప్ప సీన్ ని ఎన్టీఆర్ కేవలం సింగిల్ టెక్ లో ఒకే చేసాడట. మరి ఎన్టీఆర్ మాత్రమే కాదు. ఇపుడు ఎన్టీఆర్ పాత్రధారి బాలయ్య కూడా ఆ సీన్ ని కేవలం ఒకే ఒక్క టెక్ లో పూర్తి చేసాడంటున్నారు. మరి సింగిల్ టేక్ లో ఆ సీన్ ని క్రిష్ చిత్రీకరించగా సెట్ లోని వాళ్లంతా క్లాప్స్ కొట్టేశారని అంటున్నారు. బొబ్బిలి పులిగా బాలకృష్ణ అదరగొట్టేశాడని చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ సినిమాలో సూపర్ హిట్స్ ని క్రిష్ బాలయ్య రూపంలో మరోసారి రిపీట్ చేస్తున్నాడు.

Similar News