బాలయ్య – బోయపాటి సినిమాకి బ్రేకులు?

బాలకృష్ణ – బోయపాటి బడ్జెట్ విషయంలో ఏదో జరుగుతుంది అని మనం ముందే న్యూస్ ఇచ్చేశాం. నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డి.. బాలయ్య రూలర్ సినిమా దెబ్బకి [more]

Update: 2019-12-25 04:55 GMT

బాలకృష్ణ – బోయపాటి బడ్జెట్ విషయంలో ఏదో జరుగుతుంది అని మనం ముందే న్యూస్ ఇచ్చేశాం. నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డి.. బాలయ్య రూలర్ సినిమా దెబ్బకి బోయపాటి తో తియ్యబోయే బాలకృష్ణ సినిమాకి బడ్జెట్ కోత విధించడానికి రెడీ అయ్యాడని అన్నారు. 70 కోట్ల నుండి 50 కోట్లకి బడ్జెట్ కోత పెడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. తాజాగా రవీంద్ర రెడ్డి నిజంగానే బోయపాటి – బాలయ్య సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడని, బోయపాటికి ఫిక్స్ చేసిన 15 కోట్ల పారితోషకం, బాలకృష్ణ కి ఫిక్స్ చేసియాన్ 10 కోట్ల పారితోషకాలను హోల్డ్ లో పెట్టి.. బడ్జెట్ విషయంలో లెక్కలేస్తున్నాడని.. ఇక దర్శకుడు , హీరో పారితోషకాలను పక్కన పెట్టేసి ఆ ఇద్దరికి సినిమా లాభాల్లో వాటా ఇచ్చేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా లేటెస్ట్ టాక్.

ఇద్దరూ ఒప్పుకునే వరకూ…

అయితే ఇటు బోయపాటి అటు బాలయ్య ఒప్పుకునే వరకు సినిమాని పట్టాలెక్కించకూడదని కూడా నిర్మాత రవీందర్ రెడ్డి డిసైడ్ అయ్యాడని ఫిలింనగర్ గుసగుసలు. బాలయ్య నో అన్నా, బోయపాటి నో అన్నా ఈ సినిమా ఆగిపోయేట్లుగా ఉందని, ఒకవేళ దర్శకుడు హీరో బాలయ్య కలిసి మరో నిర్మాతని వెతుక్కుని ఈ సినిమా చేసినా చెయ్యొచ్చనే ఉహాగానాలు ఫిలింనగర్ లో నడుస్తుంది. మరి రవీందర్ రెడ్డి ప్రపోజల్ కి బాలయ్య, బోయపాటి ఓకె అంటారో.. లేదంటే కొత్త నిర్మాతతో సినిమాని ముందుకు తీసుకెళ్తారో అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

Tags:    

Similar News