‘బాహుబలి’ ని బీట్ చేద్దాం అనుకున్నారు కానీ

Update: 2018-12-16 04:55 GMT

'బాహుబలి' పుణ్యమా అని ప్రతి ఇండస్ట్రీ నుండి ఏదొక సినిమా 'బాహుబలి' రికార్డ్స్ ను బ్రేక్ చేయడానికి వస్తున్నాయి. ఎక్కువ బడ్జెట్ తో తీసే సినిమాలు..స్టార్ ఇమేజ్ ఉన్న సినిమాలు 'బాహుబలి' తో పోల్చడం కామన్ అయిపోయింది. ఆ మధ్య తమిళం లో విజయ్ నటించిన ‘పులి’ని ‘బాహుబలి’తో పోల్చారు. కానీ అది డిజాస్టర్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా హిందీ లో 'బాహుబలి' రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడానికి ఓ సినిమా వచ్చింది. అమీర్ ఖాన్..అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోస్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ వచ్చింది.

ఈసినిమా ఇండియా లో ఉన్న అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి మొదటి స్తానం లో ఉంటది అని అంత భావించారు. కానీ అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు తాజాగా మలయాళ మూవీ ‘ఒడియన్’కూ ఈ పోలిక వచ్చింది. 'బాహుబలి' లాంటి సినిమా కాకపోవచ్చు కానీ రికార్డుల్ని బద్దలు కొట్టే చిత్రమిదని ప్రచారం చేశారు. మలయాళ సినీ చరిత్ర లోనే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు రూ.100 కోట్ల బిజినెస్ జరగడం విశేషం. దాంతో మలయాళ ఇండస్ట్రీ మొత్తం ఈసినిమా కోసం చాలా వెయిట్ చేసింది. ఇక వసూళ్లు దానికి రెట్టింపు వస్తాయని అభిమానులు సవాళ్లు విసిరారు. కానీ అంత మాట్లలకే పరిమితం అయింది. ‘ఒడియన్’ సినిమా రిలీజ్ అయినా ప్రతి చోట డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఈసినిమా మీద ‘మన్యం పులి’ చిత్రం వెయ్యి రేట్లు బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. కంటెంట్ పరంగా...30-40 ఏళ్ల కాలం రొమాన్స్.. విలనిజం తో జనాలని విసిగించేసారు. దాంతో తొలి రోజే ఈమూవీ ప్రేక్షకులు తిరస్కరించారు. రికార్డు బ్రేకింగ్ మూవీ అవుతుందని ఆశ పడ్డ ‘ఒడియన్’ టీంకు ఇది పెద్ద షాకే. మాలయంలో ఏమో కానీ తెలుగు లో ఈసినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ.

Similar News