మనకి బాహుబలి అంటే ఓ వండర్ కాని అక్కడ కాదు!

Update: 2018-05-06 08:43 GMT

'బాహుబలి' ..'బాహుబలి' 2 ఇండియాలో ఎంత సెన్సేషన్ అయిందో రికార్డ్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. 'బాహుబలి' 2 ఇండియా వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే ఈ సినిమా దగ్గరలోకి రావడానికి ఏ సినిమాకైనా కష్టమే అని చెప్పాలి. అలాంటి 'బాహుబలి' సినిమాకు చైనా లాంటి దేశంలో చుక్కెదురు అవుతోంది.

జపాన్ తరహాలో....

'బాహుబలి' ది బిగినింగ్ అక్కడ భారీగానే రిలీజ్ చేసారు కానీ ప్లాప్ అయింది. దీంతో నిర్మాతలు తమ ఇంటెలిజెన్స్ అప్లై చేసి మొదట 'బాహుబలి' 2 ను జపాన్ లో రిలీజ్ చేసి 100 డేస్ ఫంక్షన్ కూడా చేసారు. ఈ ఫంక్షన్ కు రాజమౌళి కూడా వెళ్లి హడావిడి చేశాడు. అదే బజ్ ను బేస్ చేసుకుని చైనాలో మళ్లీ భారీగా రిలీజ్ చేసే సాహసం చేశారు 'బాహుబలి' మేకర్స్.

ఏడువేల థియేటర్స్ లో రిలీజ్ చేసి....

చైనాలో ఏకంగా 7వేల థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసారు. తొలి రోజున 2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయంటూ భారీ హంగామా కూడా నడుస్తోంది. నిజానికి ఈ వసూల్ చాలా తక్కువనే చెప్పాలి ఎందుకంటే హిందీ మీడియం లాంటి సినిమాలు అక్కడ 3.42 మిలియన్ డాలర్లు తొలిరోజున దక్కాయి. అంతేకాకుండా చైనా న్యూస్ పేపర్స్ లో ఈ సినిమాను గ్రాఫికల్ మూవీ అని తేల్చిపడేశాయి. మౌత్ టాక్ కూడా డల్ గా ఉందని చైనా పేపర్స్ చెబుతున్నాయి. మనకంటే రాజులు.. యుద్దాలు అంటే కొత్త కాని.. చైనాలో ఇటువంటి థీమ్ ఎప్పటి నుండో ఫాలో అవుతున్నారు పైగా ఫైట్స్.. గ్రాఫిక్స్ మనకన్నా బాగుంటాయి. అందుకే ఈ సినిమా కాసింత కూడా ఆకట్టుకోలేకపోయింది అనే టాక్ వినిపిస్తోంది.

Similar News