సాహో వారికి నిద్రలేకుండా చేస్తుంది

ఇప్పుడు ఇండియా మొత్తం సాహో చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ ఏ ఇద్దరూ సినీ ప్రేమికులు కలిసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. హిందీ లో ఈమూవీ [more]

Update: 2019-08-26 07:18 GMT

ఇప్పుడు ఇండియా మొత్తం సాహో చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ ఏ ఇద్దరూ సినీ ప్రేమికులు కలిసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. హిందీ లో ఈమూవీ అక్కడ స్టార్ హీరోస్ కి దీటుగా రిలీజ్ అవుతుంది. సాహో కి వస్తున్న బజ్ చూసి బాలీవుడ్ స్టార్ హీరోస్ అంత బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఒక సౌత్ హీరో కి ఇంత క్రేజ్ ఎలా వస్తుంది అని తలలు పట్టుకుంటున్నారు.

బాలీవుడ్ లో స్టార్ హీరోస్ అని పిలవబడే షారుఖ్, సల్మాన్ వంటి హీరోస్ సినిమాలకి నార్త్ మినహా ఇస్తే, సౌత్ లో అంతగా ప్రచారం దక్కడం లేదు. భారీ కాస్టింగ్ తో సినిమాలు నిర్మిస్తున్న సరైన ప్రమోషన్ దక్కడంలేదు. అమితాబ్, అలియా భట్, రణ్వీర్ కపూర్, నాగార్జున వంటి స్టార్స్ తో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర చిత్రం గురించి ఎంత మందికి తెలుసు? కానీ సాహో విషయంలో అలా కాదు.

పాన్ ఇండియా సినిమా కావడంతో ఈసినిమా కి అందుతున్న క్రేజ్ చూసి బాలీవుడ్ వారిని ఒకింత ఈర్ష్య పడేలా చేస్తుంది. ఆమధ్య వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఎంత మంది కి తెలుసు? పైగా అందులో అమీర్ ఖాన్, కత్రినా, అమితాబ్ వంటి స్టార్స్ నటించారు. ఎదిఎమైనా మన సౌత్ సినిమాలు ముఖ్యంగా మన తెలుగు సినిమాలు బాలీవుడ్ హీరోస్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయి. సాహో లాంటి క్రేజ్ తో సైరా, #RRR వంటి చిత్రాలు కూడా రెడీ గా ఉన్నాయి.

Tags:    

Similar News