ఒక్కసారిగా బాబా ని ఎత్తేసారేమిటి?

బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటినుండి.. మొన్న వారం వరకు ప్రతి వీకెండ్ లో బాబా భాస్కర్ ని నాగార్జున విమర్సిస్తూనే ఉన్నాడు. హౌస్ [more]

Update: 2019-10-31 14:34 GMT

బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటినుండి.. మొన్న వారం వరకు ప్రతి వీకెండ్ లో బాబా భాస్కర్ ని నాగార్జున విమర్సిస్తూనే ఉన్నాడు. హౌస్ లో మాస్క్ వేసుకుని ఆడుతున్న బాబా అంటూ వెక్కిరిస్తున్నారు. నిజం గానే భాస్కర్ మంచోడా? కాదా? అని కూడా ఆప్రేక్షకుల్లో బోలెడంత అనుమానం. ఎవరు గొడవ పడిన స్టాండ్ తీసుకోడు, టాస్క్ లు అర్ధం కావని చెబుతాడు. అయితే బాబా ని ఇప్పటి వరకు టెన్షన్ పెట్టిన బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన్ని హైలెట్ చెయ్యడం వెనుక శ్రీముఖి పై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్న బిగ్ బాస్ నిర్వాహకుల మీద వస్తున్నా ట్రోలింగ్ ప్రధాన కారణమంటున్నారు.

ఇప్పటివరకు శ్రీ ముఖిని ఎక్కువగా హైలెట్ చేస్తున్నారని, శ్రీముఖి టైటిల్ విన్నర్ కావాలని ముందే డిసైడ్ అవ్వడంతోనే శ్రీముఖి అన్ని ఎలిమినేషన్స్ దాటేసింది, బయటికొచ్చిన కంటెస్టెంట్స్ చెప్పడమే కాదు… షో చూస్తున్న ప్రేక్షకులు అంటున్నారు. ఆమె యాంకర్ కాబట్టి.. అన్ని విషయాల్లో ఎనెర్జీతో ఉన్నప్పటికీ.. ఆమె కన్నా రాహుల్. వరుణ్, అలీ లాంటివాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయినా శ్రీముఖిని షో నిర్వాహకులు హైలెట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. ఆ అపవాదు నుండి తప్పించుకోవడానికే గత రాత్రి బిగ్ బాస్ మధుర స్మృతుల్లో బాబా ని సూపర్‌స్టార్‌ ఆఫ్‌ ది సీజన్‌ అంటూ ఆకాశానికెత్తేయ్యడం, బాబా ని బిగ్ బాస్ కూడా హైలెట్ చెయ్యడంతో… బాబా ఒక్కసారిగా ఓటింగ్ లో ముందుకొచ్చేసాడు. రాహుల్, శ్రీముఖి, వరుణ్ తర్వాత స్థానంలో ఉన్న బాబా ఇప్పుడు రాహుల్ తర్వాతి ప్లేస్ కి వచ్చాడంటే…. ఆయన్ని బిగ్ బాస్ ఎంతెలా ఎత్తాడో అర్ధమవుతుంది.

Tags:    

Similar News