ఈవారం అవినాష్ కష్టమే!!

బిగ్ బాస్ సీజన్ 4 హాట్ గా చప్పగా, గరంగా సాగుతూ మరో నాలుగు వారాల్లో ప్యాకప్ చెప్పెయ్యబోతుంది. ఇక సోమవారం నామినేషన్స్ లో అఖిల్, అవినాష్, [more]

Update: 2020-11-25 05:15 GMT

బిగ్ బాస్ సీజన్ 4 హాట్ గా చప్పగా, గరంగా సాగుతూ మరో నాలుగు వారాల్లో ప్యాకప్ చెప్పెయ్యబోతుంది. ఇక సోమవారం నామినేషన్స్ లో అఖిల్, అవినాష్, మోనాల్, అరియనాలు నామినేట్ అయ్యారు. ముందుగా ఆభిజీత్ నామినేట్ అవ్వగా మోనాల్ అభిజిత్ తో స్వాప్ చేసుకుంది,. అయితే ఈ వారం మోనాల్ హౌస్ లో ఉండడం పక్కాగా కనబడుతుంది. గత మూడు వారాలుగా అఖిల్ దూరం పెట్టడంతో మోనాల్ గట్టిగా ఆడుతుంది. ఇక అఖిల్ టాప్ 5 లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సేవ్ అవడం ఖాయం. కానీ ఇప్పుడు అరియనా – అవినాష్ లలో ఒకరు ఎలిమినేట్ అవడం ఖాయంగా కనబడుతుంది.

అందులో అవినాష్ టాస్క్ పెరఫామెన్సెస్ కన్నా కామెడీతోనే ఇన్ని వారాలుగా నెట్టేస్తున్నాడు. నాగార్జున చెప్పారంటూ కామెడీ చేస్తూ బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నప్పటికీ… కామెడి కామెడీనే.. హీరోయిజం హీరోయిజమ్ అన్నట్టుగా ఉంది హౌస్ లొ. మోనాల్ తో గట్టిగా వాదించిన అవినాష్ తన కడుపులో ఉన్నదంతా కక్కేసాడు. ఇక అరియనా గ్రాఫ్ సోషల్ మీడియాలో బావుంది. ఎటు చూసినా ఈసారి కమెడియన్ అవినాష్ ఎలిమినేట్ అవ్వక తప్పేలా లేదు. అవినాష్ నేను తెలివిగా ఆడుతున్నా.. దొరక్కుండా ఆడుతున్నా, అందుకే నామినేషన్స్ కి రాలేదు అంటూ వాదించినా హౌస్ లో వరస ప్రకారం బయటికి వెళ్ళాలి కాబట్టి.. ఈ వారం అవినాష్ బలవ్వడం ఖాయంగానే కనబడుతుంది.

Tags:    

Similar News