మంచోడు టాగ్ ని బద్నామ్ చేసాడే!!

బిగ్ బాస్ సీజన్ 4 కి మొదటి వారం లోనే వైల్డ్ కార్డు ఇచ్చిన కమెడియన్ జబర్దస్త్ అవినాష్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటినుండి మంచి వాడిగా కామెడీ [more]

Update: 2020-11-02 08:19 GMT

బిగ్ బాస్ సీజన్ 4 కి మొదటి వారం లోనే వైల్డ్ కార్డు ఇచ్చిన కమెడియన్ జబర్దస్త్ అవినాష్ హౌస్ లోకి అడుగుపెట్టినప్పటినుండి మంచి వాడిగా కామెడీ చేస్తూ అందరితో కలిసిపోయాడు. అవినాష్ హౌస్ లోకి అడుగుపెట్టాకే బిగ్ బాస్ లో కామెడీ పంచెస్ పేలుతున్నాయి. అతను నడిచినా కామెడీనే, మాట్లాడినా కామెడీనే, ఏం చేసినా కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇక శనివారం, ఆదివారం కూడా నాగార్జున అవినాష్ కామెడీని బాగా పొగడడం హైలెట్ చెయ్యడం జరుగుతుండడంతో.. అవినాష్ కి బయట మంచి ఫాన్స్ స్టార్ట్ అయ్యారు. అందులోను కామెడీ ప్రియులు అవినాష్ కి అండగా ఉండనే ఉన్నారు.

ఇక అరియానాతో అవినాష్ స్నేహం, మధ్యలో పెళ్లి ముచ్చట్లతో మంచివాడిగా టాగ్ తగిలించుకున్నాడు అవినాష్. ఇక ఒక వారం బిగ్ బాస్ టాస్క్ లో అవినాష్ సంచాలక్ అయిన సోహైల్ మీద ఫైర్ అయ్యాడు. కామెడీ అంటే కామెడీ చేస్తాం, కోపం వస్తే కోపం చూపిస్తాం అంటూ బాగా కోపం తెచ్చుకున్నాడు. అదలా ఉంటే శనివారం ఎపిసోడ్ లో అనారోగ్య కారణాలతో బిగ్ బాస్ హౌస్ ని వీడిన నోయెల్ పోతూ పోతూ అవినాష్ ని అమ్మ రాజశేఖర్ ని బ్యాడ్ చేసిపారేసి పోయాడు. అవినాష్ ని చిల్లర కామెడీ చేస్తూ.. నా కాళ్ళు నొప్పులను నువ్వు కామెడీ చేసావ్ అనగానే అవినాష్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నేను చిల్లర కామెడీ చేసే వాడిని అయితే బిగ్ బాస్ లోకి రాను.. నన్ను ఇక్కడికి పిలవరు, హౌస్ లో ఉండగా నా కామెడీ ఎంజాయ్ చేసి వెళుతూ వెళుతూ ఓ ఇద్దరినీ బ్యాడ్ చెయ్యాలని బాగా ఫిక్స్ అయ్యావు.

కోట్లమంది బిగ్ బాస్ ని చూస్తున్నారు. నేను చిల్లర కామెడీ చేస్తున్నానా. అంటూ అవినాష్ మొహం వాడిపోయింది. కోపంతో అవినాష్ ఊగిపోయాడు. మరి ఇప్పటివరకు మంచి వాడు అంటూ అనిపించుకుంటూ ఉన్న అవినాష్ నోయెల్ చేసిన ఒకే ఒక్క మాట తో ఎంత బ్యాడ్ అయ్యాడంటే.. అది మాములు డ్యామేజ్ కాదు… నోయెల్ ఎమన్నా అవినాష్ కామ్ గా ఉంటే సరిపోయేది. హౌస్ మేట్స్ కామెడీ చెయ్యమంటే చేశా అని చెప్పేస్తే సరిపోయేది. కానీ అవినాష్ అలా రెచ్చిపోయి తనని తానే కాస్త బ్యాడ్ చేసుకున్నాడా అనిపించక మానదు.

Tags:    

Similar News