బన్నీ పక్కన డాన్స్ చేస్తే కాళ్లు విరగడం ఖాయం

టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ డాన్స్ లో నెంబర్ వన్ హీరోలు. ఒకరు ఎక్కువా కాదు ఒకరు తక్కువా కాదు.. ఆ రేంజ్ [more]

Update: 2019-12-03 06:13 GMT

టాలీవుడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ డాన్స్ లో నెంబర్ వన్ హీరోలు. ఒకరు ఎక్కువా కాదు ఒకరు తక్కువా కాదు.. ఆ రేంజ్ లో ఉంటాయి వాళ్ళ డాన్స్ లు. అయితే ఎన్టీఆర్ కథకి అనుగుణంగా సినిమాలో డాన్స్ లు లేకపోయినా సర్దుకుపోతాడేమో గాని.. అల్లు అర్జున్ మాత్రం తన సినిమాల్లో ఫ్యాన్స్ కి మెచ్చే స్టెప్స్ ఖచ్చితంగా ఉండాలని కోరుకోవడమే కాదు… కొత్త మాస్ స్టెప్స్ కోసం ట్రై చేస్తుంటాడు. అందుకే చాలామంది హీరోయిన్ బన్నీ తో డాన్స్ చెయ్యడానికి భయపడుతుంటారు. పూజ, తమన్నా లాంటి వాళ్ళు అల్లు అర్జున్ తో డాన్స్ కంఫర్ట్ గా ఉంటుంది కానీ…. ఎన్టీఆర్ తో కాస్త భయమంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ రిహార్సల్స్ చెయ్యకుండానే సెట్ పైకి వెళ్ళిపోతాడట.

అయితే బన్నీ తో డాన్స్ చేస్తే కాళ్లు విర్రగొట్టోకోవాలంటూ ఓ యంగ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ కి పిచ్చ సంతోషాన్నిస్తున్నాయి. ఒకప్పుడు రాజ్ తరుణ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి.. మధ్యలో కనబడకుండా వెళ్లి మళ్ళీ రాజుగారి గది 3 తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ ని ఓ మీడియా మిత్రుడు మీకు అల్లు అర్జున్ తో డాన్స్ చేసే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు అని అడగగా.. దానికి అవికా గోర్ షాకవడమే కాదు…. అల్లు అర్జున్ తో డాన్స్ చేసి కాళ్ళు విరగ్గొట్టుకోమంటారా…. అల్లు అర్జున్ తో డాన్స్ చేయడం చాలా కష్టమని నవ్వుతూ చెప్పేసింది. మరి నిజంగానే అల్లు అర్జున్ తో కలిసి స్టెప్ వెయ్యాలి అంటే.. హీరోయిన్స్ వణకాల్సిందే కదా.

Tags:    

Similar News