బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న హాలీవుడ్ మూవీ

Update: 2018-04-30 04:32 GMT

భాషతో సంబంధం లేకుండా ప్రాంత భేదాలు లేకుండా ఈ శుక్రవారం విడుదల అయిన హాలీవుడ్ మూవీ ‘ఎవెంజర్స్: ది ఇన్ఫినిటీ వార్’ బాక్స్ ఆఫీస్ వద్ద దాడి మామూలుగా లేదు. బాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలన్నింటికంటే తొలి రోజు ‘ఎవెంజర్స్’కే అత్యధిక వసూళ్లు రావడం విశేషం. దీంతో ఈ సినిమా రూ.32 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసి మొదటి స్తానంలో నిలిచింది.

రెండో స్థానంలో ‘బాగి-2’ రూ.25 కోట్లతో ఉంది. ‘పద్మావతి’ రూ.19 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఒక హాలీవుడ్ మూవీ బాలీవుడ్ చిత్రాల్ని మించి ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అనూహ్యమైన విషయం. గతంలో ‘అవతార్’.. 'జంగల్ బుక్' సినిమాలకు హైప్ అయితే వచ్చింది కానీ ఈ స్థాయిలో వసూళ్లు అయితే రాలేదు. భాషతో సంబంధం లేకుండా అందరు ఈ సినిమాను చూడడంతో వసూళ్లు సునామిలా వచ్చి పడుతున్నాయి.

వారాంతంలోనే ఈ చిత్రం రూ.100 కోట్లకు చేరువుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వీకెండ్లో ఈ చిత్రానికి టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఫుల్ రన్లో రూ.200 కోట్ల మార్కును కూడా అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. చిన్నవాళ్ళ నుండి పెద్ద వాళ్ళ దాక సినిమాపై అమితాసక్తి చూపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.

Similar News