అవేంజర్స్ ను ఆపలేకపోతున్నారు..!

ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా ఎవెంజర్స్ సిరీస్ నుండి వచ్చిన ‘అవెంజర్స్ ది ఎండ్ గేమ్’ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ నుండే భారీ వసూళ్లను సాధిస్తూ [more]

Update: 2019-04-29 08:25 GMT

ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా ఎవెంజర్స్ సిరీస్ నుండి వచ్చిన ‘అవెంజర్స్ ది ఎండ్ గేమ్’ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ నుండే భారీ వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. లేటెస్ట్ గా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మొదటి మూడు రోజుల్లో 1.2 బిలియన్ల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 8400 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఏ మాత్రం తగ్గకుండా 350 మిలియన్ల డాలర్స్ ను రాబట్టడం విశేషం. ఇండియాలో ఈ సినిమా జోరు మాములుగా లేదు. ఇక్కడ అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డ్స్ ను చాలా తక్కువ కాలంలోనే బ్రేక్ చేయనుంది.

తెలుగులోనూ హవా..!

మొత్తానికి ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కంటే అవెంజర్స్ – ది ఎండ్ గేమ్ ఇప్పటివరకూ 93 మిలియన్ల డాలర్స్ ను అధికంగా కలెక్ట్ చెయ్యడం మరో విశేషం. తెలుగు వర్షన్ లో తానొస్ అనే పాత్రకు రానా డబ్బింగ్ చెప్పారు. తెలుగులో సైతం ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. పైగా తెలుగు డబ్ వర్షన్ లో తెలుగు సినిమాల పేర్లను, తెలుగు సినిమాల్లోని డైలాగ్ లను వాడారు. అందుకే ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్ లభిస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News