అవేంజర్స్ హవా తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ప్రస్తుతం ప్రపంచ సినిమా అభిమానులు అంతా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ విన్నా ఏ న్యూస్ చూసినా ఇదే మాట్లాడుకుంటున్నారు. వరల్డ్ [more]

Update: 2019-04-25 07:06 GMT

ప్రస్తుతం ప్రపంచ సినిమా అభిమానులు అంతా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ విన్నా ఏ న్యూస్ చూసినా ఇదే మాట్లాడుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈనెల 26న రిలీజ్ అవ్వబోతుంది. దీంతో అంతా ఈ చిత్రం కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. బాక్సాఫీస్ ఓపెనింగ్ లలో ఇప్పటివరకూ ఈ చిత్రం నెంబర్ 1 అని ఫేమస్ రోటెన్ టమోటాస్ వెబ్ సైట్ సైతం కీర్తించేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి క్రేజ్ మాములుగా లేదు. ఫస్ట్ డే టిక్కెట్లు అన్నీ అయిపోయాయంటూ బుక్ మై షో సహా ఆన్ లైన్ టికెటింగ్ సంస్థల్నీ లాక్ అయిపోవడం ప్రధానంగా చర్చకు వచ్చింది. అవతార్ తరువాత అంతటి క్రేజ్ వచ్చిన చిత్రం ఇదే కావడం విశేషం.

తొలి వారంలోనే 690 కోట్లు ఖాయం..!

ఈ సినిమా వచ్చాకా అంతకుముందు ఏమైతే రికార్డ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలోనే 690 కోట్లు(1 బిలియన్ డాలర్స్) వసూలు చేస్తుందన్నది నిపుణుల విశ్లేషణ. ఇండియాలో బాహుబలి, దంగల్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి బెస్ట్ ఓపెనర్ల రికార్డుల్నీ ఈ చిత్రం బ్రేక్ చేస్తుందని ప్రఖ్యాత ట్రేడ్ అనలిస్ట్ గిరీష్ జోహార్ చెబుతున్నారు. అమెరికాలో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని, అలానే చైనాలో 250 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ వసూళ్లను తెస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరో కొన్ని గంటల్లో ఈ సినిమా మన ముందుకు రానుంది.

Tags:    

Similar News