అవసరాలకు హీరో దొరకడం లేదా?

Update: 2018-08-30 03:23 GMT

శ్రీనివాస్ అవసరాల కేరెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా తనని తానూ ప్రూవ్ చేసుకోవడమే కాదు... తాను డైరెక్ట్ చేసే సినిమాలకు తానే కథ రచయిత కూడా. శ్రీనివాస్ అవసరాల దర్సకత్వంలో తెరకెక్కిన రెండు సినిమాలు మంచి హిట్ అయినా సినిమాలే. జంటిల్మెన్ సినిమాలో శ్రీనివాస్ అవసరాల నెగెటివ్ షేడ్స్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక సపోర్టింగ్ రోల్స్ లోను అవసరాల అదరగొడతాడు. అష్టాచమ్మతో నటన మొదలెట్టిన శ్రీనివాస్ అవసరాల ఊహలు గుసగుసలాడే తో డైరెక్టర్ అయ్యాడు. ఇక రెండో సినిమాని బుల్లి మల్టీస్టారర్ అంటే నాగ శౌర్య, నారా రోహిత్ తో జ్యో అచ్యుతానంద సినిమా చేసాడు.

ఊహలు గుసగుసలాడే సినిమాతో సక్సెస్ సాధించిన శ్రీనివాస అవసరాల నటుడిగా కొనసాగుతూనే జ్యో అచ్యుతానంద కోసం బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఇక జ్యో అచ్యుతానంద సినిమా తర్వాత మూడో సినిమా కోసం అంటే భారీ గ్యాప్ తీసుకుంటున్నాడు. అయితే శ్రీనివాస్ మూడో సినిమా హీరో నాని అని.. నాని కోసం కథ డెవెలెప్ చెయ్యగా... కథ నచ్చక నాని శ్రీనివాస్ ని హోల్డ్ లో పెట్టడం.. ఈ లోపు నాని కూడా వేరే సినిమాల్తో బిజీ కావడంతో.. అవసరాల మరో హీరో కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఇక నాని హ్యాండ్ ఇవ్వగా.. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ని అవసరాల హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడన్నారు. కానీ అది ఒక ప్రచారమే అని తేలిపోయింది.

ఇక తాజాగా శ్రీనివాస్ అవసరాల హీరోల లిస్ట్ లో ముద్ర సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిఖిల్ అంటున్నారు. కార్తికేయ, స్వామి రారా, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాల్తో మార్కెట్ ని పెంచుకున్న నిఖిల్ అవసరాల డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలో నటిస్తున్నాడని టాక్ వినబడుతుంది. ఇప్పటికే అవసరాలకు నిఖిల్ కి మధ్య కథా చర్చలు జరిగినట్టుగా... వీరు కాంబోలో సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని అవసరాల పాత నిర్మాత సాయి కొర్రపాటే నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది

Similar News