జబర్దస్త్ టీం పై ఆకతాయిల దాడి

ఈటివి లో జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన నరేష్ ఒక మంచి డాన్సర్ కూడా. నరేష్ చిన్న వాళ్లలో చిన్న వాడిగా.. పెద్దవాల్లో [more]

Update: 2019-02-10 07:05 GMT

ఈటివి లో జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన నరేష్ ఒక మంచి డాన్సర్ కూడా. నరేష్ చిన్న వాళ్లలో చిన్న వాడిగా.. పెద్దవాల్లో పెద్దవాడిగా కామేడిపండించే సత్తా ఉన్న వాడు. ఇక జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయినా వీళ్ళు బయట కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవేట్ ఈవెంట్స్ లో తమ టాలెంట్ ని చూపిస్తుంటారు. కామెడీ, డాన్స్ ఇలా లైవ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అయితే ఇలాంటి ఒక కార్యక్రమానికి వెళ్లి వస్తున్న జబర్దస్త్ నరేష్ టీం పై కొంతమంది ఆకతాయిల దాడి ఇప్పుడు పోలీస్ ల వరకు వెళ్ళింది.

ఆంధ్ర లోని శ్రీకాకుళం లో అజరిగే క‌ళింగాంధ్రా ఉత్స‌వాల్లో పాల్గొని వస్తున్న నరేష్ టీం పై కొంతమంది యవకుల దాడి కలకలం రేపుతోంది. అయితే ఈ దాడి కి కారణం ఏమిటంటే.. నరేష్ టీం ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేసేముందు.. వారి గ్రీన్ రూమ్ లోకి కొంతమంది కుర్రాళ్ళు తొంగి చూడడంతో.. నరేష్ టీం కి ఆ యువకులకు మాట మాట పెరిగిందని…. అది మనసులో పెట్టుకున్న కుర్రాళ్ళు నరేష్ వాళ్ళు ప్రోగ్రాం ముగించుకుని వెళ్లిపోతున్నా సమయంలో ఆ యువకులు నరేష్ టీంపై దాడికి దిగారని చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారం పోలీస్ ల వరకు వెళ్లడమే కాదు.. మీడియాలో కూడా కథలు కథలుగా ప్రసారంలోకి వచ్చింది.

Tags:    

Similar News