వాళ్ళకి భయపడి తప్పుకున్నాడా ఆయనొచ్చేస్తాడు!!

కన్నడ ప్రేక్షకులు దర్శకుడు ప్రశాంత్ నీల్ పై కత్తి కట్టారు. కెజిఎఫ్ సినిమా క్రేజ్ తో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో సినిమా కి కమిట్ [more]

Update: 2020-05-24 07:21 GMT

కన్నడ ప్రేక్షకులు దర్శకుడు ప్రశాంత్ నీల్ పై కత్తి కట్టారు. కెజిఎఫ్ సినిమా క్రేజ్ తో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో సినిమా కి కమిట్ అయిన ప్రశాంత్ నీల్ ని కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. పక్క భాషకు పోయి స్టార్ హీరోని తగులుకుంటావా.. వాళ్ళ దర్శకులని చూసి సిగ్గు తెచ్చుకో అంటూ సోషల్లో మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అసలు ప్రశాంత్ నీల్ ది తప్పులేదు.. ఎన్టీఆర్ పిలిస్తేనే వేళ్ళాడన్న పట్టించుకోవడం లేదు. అయితే కెజిఎఫ్ తో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 తో కన్నడ నాట ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని ఎన్టీఆర్ సినిమాని వదులుకునే ఛాన్స్ ఉందంటున్నారు,. ఒకవేళ ఎన్టీఆర్ సినిమా మీదే ప్రశాంత్ నీల్ ఉన్నాడంటే కెజిఎఫ్ 2 కి కన్నడ ప్రేక్షకులు చుక్కలు చూపించడం ఖాయమగానే కనబడుతుంది.

అందుకోసం ప్రశాంత్ నీల్ ఎమన్నా వెనక్కి తగ్గాడా ఎన్టీఆర్ కోసం మరో డైరెక్టర్ కాచుకుని కూర్చున్నాడు. అతనే తమిళ దర్శకుడు అట్లీ. అట్లీ ఎప్పటినుండో ఎన్టీఆర్ తో సినిమా కోసం వెయిట్  చేస్తున్నాడు. కోలీవుడ్ లో స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాల్తో టాప్ లెవల్లో ఉన్న అట్లీ ఎన్టీఆర్ తో సినిమా కోసం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అట్లీ – ఎన్టీఆర్ కాంబో కి నిర్మాతగా అశ్విని దత్ వ్యవహరించనున్నాడని… ఇప్పటికే ఎన్టీఆర్ కి అట్లీ కి అశ్విని  దత్ మీటింగ్ ఆరెంజ్ చేసాడనే టాక్ కూడా ఉంది. మరి RRR తర్వాత త్రివిక్రమ్ మూవీ ముగించేలోపు ప్రశాంత్ నీల్ తోనా.. అట్లకీ తోనా ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ అనేది తెలుస్తుంది.

Tags:    

Similar News