పుష్ప విలన్ ఫిక్స్ అయ్యాడా?

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో   తాజాగా మొదలైన పుష్ప సినిమా కి ఇంకా విలన్ ఎవరూ ఫిక్స్ కాలేదు. ముందుగా విలక్షణ నటుడు విజయ్ [more]

Update: 2020-11-14 05:36 GMT

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో   తాజాగా మొదలైన పుష్ప సినిమా కి ఇంకా విలన్ ఎవరూ ఫిక్స్ కాలేదు. ముందుగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పుష్ప కోసం విలన్ గా అనుకుంటే.. విజయ్ డేట్స్ ప్రోబ్లెంస్ వలన తప్పుకున్నాక సుకుమర్ కి పుష్ప రాజ్ ని ఢీ కొట్టే విలన్ వేటలో ఉన్నాడు కానీ.. ఇంతవరకు పుష్ప విలన్ పై టీం క్లారిటీ ఇవ్వలేదు. గత వారంలో అల్లు అర్జున్ పుష్ప కోసం సుకుమార్ బాలీవుడ్ విలన్ ని సెట్ చేశాడన్నారు కానీ.. అదేమీ లేదు. తాజాగా పుష్ప విలన్ ని ఫైనల్ చేసినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్ పుష్ప లుక్ చూస్తుంటే అల్లు అర్జున్ మాస్ కాదు.. అంతకు మించి కనిపిస్తున్నాడు.

మరి పుష్పలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ మాస్ లుక్ కి సరిపోవాలంటే విలన్ కూడా మాస్ గా ఉంటాడా? లేదంటే స్టైలిష్ గా కనిపిస్తాడా? అనే దాని మీద క్లారిటీ లేకపోయినా… అల్లు అర్జున్ కోసం ఓ బడా హీరో కాని, లేదంటే మరో బడా నటుడు కానీ విలన్ గా చేస్తే బావుంటుంది అనుకున్నారు. కానీ సుకుమార్ కి ఎవరూ నచ్చడం లేదు. తాజాగా పుష్ప విలన్ గా అల్లు అర్జున్ వరుడు విలన్ నటించబోతున్నాడని అంటున్నాడు. వరుడు లో అల్లు అర్జున్ ని ఢీ కొట్టిన తమిళ హీరో ఆర్య ఇప్పుడు పుష్ప విలన్ గ కనిపిస్తాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఆర్య క్రేజ్ బాలీవుడ్ కి సరిపోతుందా? లేదా.. అని సుకుమార్ అండ్ టీం ఆలోచనలో ఉన్నట్లుగా టాక్.

Tags:    

Similar News