బెల్లంకొండ పై అరెస్టు వారెంటు జారీ

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ పై అరెస్టు వారెంటు జారీ అయింది. టాలీవుడ్ లో ఉన్న ప్రొడ్యూసర్స్ లో ఈయన అప్పటిలో [more]

Update: 2019-08-02 03:20 GMT

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ పై అరెస్టు వారెంటు జారీ అయింది. టాలీవుడ్ లో ఉన్న ప్రొడ్యూసర్స్ లో ఈయన అప్పటిలో వివాదాస్పదమైన ప్రొడ్యూసర్. ఇతని చుట్టూ అప్పటిలో చాలా కాంట్రోవర్సిస్ తిరిగాయి. ఇది పక్కన పెడితే బెల్లంకొండ సురేష్ ఓ ఛానల్ వారికి 3.5 కోట్లు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి తిప్పుతున్నారని..ఆ కారణంగా ఆ ఛానల్ వారు కోర్ట్ ని ఆశ్రయించడం తో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని తెలుస్తుంది.

గతంలో బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్ గా జబర్దస్త్ అనే ఒక సినిమా తీసాడు. దీన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేయగా సిద్దార్థ్, సమంత హీరో హీరోయిన్ గా నటించారు. ఈమూవీ హిందీ లో వచ్చిన బ్యాండ్ బాజా బారత్ ని కాపీ కొట్టి తీసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అందుకే అప్పుడు ఈసినిమాను ఆపేయాలని హిందీ నిర్మాత అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ కోర్టును ఆశ్రయించి కోర్ట్ నుండి ఆపేయాలని నోటీసు తెచ్చుకున్నారు. అయితే అప్పటికే బెల్లంకొండ ఈమూవీ ని మూడున్నర కోట్లకు ఒక టీవీ ఛానల్ కు అమ్మేసుకున్నారు.

టీవీ ఛానల్ లో కూడా ఈచిత్రం ప్రసారం కాకూడదు అని కోర్టును ఆశ్రయించింది. కోర్టు యశ్ రాజ్ ఫిలింస్ కు అనుకూలంగా తీర్పు నిచ్చింది. దింతో ఈసినిమా రైట్స్ కొన్న టీవీ ఛానల్ వారు తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని కోరగా ఇదిగో అదిగో అంటూ తిప్పించుకోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. సో కోర్ట్ బెల్లంకొండ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Tags:    

Similar News