అర్జున్ రెడ్డి తమిళ జోడీ ఆమేనా..?

Update: 2018-07-05 07:17 GMT

టాలీవుడ్ లో సందీప్ వంగ దర్శకత్వంలో బోల్డ్ మూవీ గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ - షాలిని పాండే జంటగా వచ్చిన ఈ సినిమా తో విజయ దేవరకొండ యూత్ ఐకాన్ గా మారిపోయాడు. షాలిని పాండే ప్రేమలో మునిగిపోయి.. ప్రేమ విఫలం కావడంతో.. తాగుడుకు బానిసై కుటుంబానికి దూరమైన సీన్స్ లో విజయ దేవరకొండ నటనకు ఎంతగా పేరొచ్చిందో.. షాలిని పాండే పాత్రకు అంతే పాత్రకు పేరొచ్చింది. విజయ్ తో బోల్డ్ సీన్స్ లో నటించిన షాలిని ఈ సినిమాతో క్రేజ్ కొట్టేసింది. అయితే ఈ అర్జున్ రెడ్డి ఇక్కడ బ్లాక్ బస్టర్ అవడంతో.. ఈ సినిమాని తమిళ్, హిందీ లోనూ రీమేక్ చేస్తున్నారు.

షాలిని పాత్రలో మేఘా చౌదరి

తమిళ్ లో విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా విలక్షణ దర్శకుడు బాలా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి ని రీమేక్ చేస్తున్నారు. ఇక హిందీలో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ వంగానే రీమేక్ చేస్తున్నాడు. ఇక తమిళ్ లో అర్జున్ రెడ్డి సినిమా మొదలై చాలా రోజులవుతున్నప్పటికీ... ఇప్పటివరకు ధృవ్ సరసన హీరోయిన్ ని సెట్ చెయ్యలేదు. తెలుగులో బేబీ అంటూ అందరినీ పడేసిన షాలిని పాండే పాత్రని తమిళంలో ఏ హీరోయిన్ చేస్తోందో అనే క్యూరియాసిటీ అందరీలో ఉంది. తాజాగా తమిళ అర్జున్ రెడ్డి లో ధృవ్ సరసన మేఘా చౌదరి అనే కొత్తమ్మాయిని సెట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మేఘా ఇప్పటికే ఓ బెంగాలీ సినిమాలో నటించింది కానీ ఆమె ఫేస్ పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. ఇంకా ఈ అమ్మాయికి శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉందట. మరి అనేకమంది పేర్లను పరిశీలించిన అర్జున్ రెడ్డి టీమ్ చివరికి షాలిని ప్లేస్ లో ఈ కొత్తమ్మాయిని ధృవ్ కి జోడిగా దర్శకుడు బాలా ఫైనలా చేసాడు.

Similar News