బాలీవుడ్ అర్జున్ రెడ్డిలో హీరోయిన్ ఎవరో తెలుసా?

Update: 2018-09-24 04:13 GMT

టాలీవుడ్ దశ దిశా మార్చేసిన 'అర్జున్ రెడ్డి' హిందీలోనూ..తమిళంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. హీరోగా ఈసినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు విక్రమ్ కుమారుడు ధ్రువ. ‘వర్మ’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను నిన్నే విడుదల చేశారు మేకర్స్. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

మరోవైపు హిందీలో ఈసినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకుగాను షాహిద్ కొన్ని నెలల నుండి పాత్ర కోసం తన అవతారం మార్చుకునే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పటివరకు హీరోయిన్ ని కంఫర్మ్ చేయలేకపోయాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. హీరోయిన్ కోసం చాలా ట్రై చేసిన తర్వాత చివరికి తార సుతారియా అనే అమ్మాయిని ఫైనలైజ్ చేశారు. అంతే ఓకే ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్ అనుకున్న టైములో తార సుతారియా చిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చింది. డేట్స్ సమస్య వల్ల ఆమె ఈసినిమాను నుండి తప్పుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చింది.

దాంతో టీంకి ఏమి చేయాలో అర్ధం కానీ పరిస్థితిల్లో ఉన్న టైములో కియారా అద్వానీని సంప్రదింపగా ఆమె స్టోరీ విని వెంటనే ఓకే చేసిందంట. గతంలో షాహిద్ , కియారా కలిసి ఓ మ్యూజిక్ వీడియోను కూడా చేశారు. ఆ చనువుతోనే ఆమెను షాహిద్ రికమెండ్ చేసాడని తెలుస్తుంది. రీసెంట్ గా ఈమె హాట్ హాట్ గా ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో యాక్ట్ చేసి యూత్ ను ఆకట్టుకుంది. దాంతో వీరిద్దరి కెమిస్ట్రీ తెరపైన బాగుంటదని బాలీవుడ్ ప్రేక్షకులు అంటున్నారు. హిందీలో ఇంకా డోస్ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. మరోసారి కియారా ఫ్యాన్స్ ఇది హాట్ హాట్ న్యూసే

Similar News