అర్జున్ రెడ్డి కాంబో రిపీట్ అవుతుందా?

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి ఓ టాప్ డైరెక్టర్ ఓ టాప్ స్టార్ హీరో దూసుకొచ్చారు. సందీప్ వంగా ఓన్ ప్రొడక్షన్ లో తెరకేకించిన అర్జున్ [more]

Update: 2020-07-08 06:51 GMT

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి ఓ టాప్ డైరెక్టర్ ఓ టాప్ స్టార్ హీరో దూసుకొచ్చారు. సందీప్ వంగా ఓన్ ప్రొడక్షన్ లో తెరకేకించిన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దానితో విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయ్యాడు. అయితే సందీప్ వంగ రెండో సినిమానే బాలీవుడ్ హీరోకి చేసాడు అది అర్జున్ రెడ్డి రీమేక్ గా. ఇక విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాత పలు తెలుగు తమిళ సినిమాలు చేసి హిట్స్ ప్లాప్స్ కొట్టాడు. తాజాగా పూరి జగన్నాధ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అయితే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ మూడో సినిమాని బాలీవుడ్ హీరోతోనే చేస్తాడని అన్నారు కానీ..అది లెట్ అవుతూ వచ్చింది.

తాజాగా సందీప్ వంగ కరోనా లాక్ డౌన్ లో బి ద రియల్ మ్యాన్ ఛాలంజ్ చేసి టాలీవుడ్ సెలబ్రిటీస్ కి ఛాలెంజే విసిరాడు. లాక్ డౌన్ ముందే సందీప్ వంగ ఓ పాన్ ఇండియా కథతో కొత్త సినిమాని ప్రకటిద్దామనుకున్నాడు. కానీ లాక్ డౌన్ అడ్డం పడింది. చేసేది ఎం లేని సందీప్ వంగ మరో రెండు కొత్త కథలని సిద్ధం చేసుకున్నాడట. అందులో ఒకటి విజయ్ దేవరకొండ కోసం రాసుకున్నడట. ఎలాగూ విజయ్ కి ఫైటర్ సినిమాతో పటు శివా నిర్వాణ సినిమా పూర్తి చేసేలోపు సందీప్ వంగ తన హిందీ సినిమాని పూర్తి చేసి వస్తాడట. అంటే అర్జున్ రెడ్డి కాంబో మల్లి పట్టాలెక్కడానికి రెండేళ్ల సమయమైతే పడుతుంది మరి. 

Tags:    

Similar News