మోనాల్ కోసం అరియనా బలికావాల్సిందేనా?

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ పై ఇంత వ్యతిరేఖత ఏ సీజన్ లోను చూడలేదు. బిగ్ బాస్ సీజన్ 4 కి మోనాల్ అర్హురాలు కాదు… [more]

Update: 2020-10-24 06:04 GMT

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ పై ఇంత వ్యతిరేఖత ఏ సీజన్ లోను చూడలేదు. బిగ్ బాస్ సీజన్ 4 కి మోనాల్ అర్హురాలు కాదు… అసలు ఇన్ని వారాలుగా ఆమె హౌస్ లో ఉండడమే పెద్ద విషయం. మోనాల్ గ్లామర్ కోసం బిగ్ బాస్ ఆమెని కాపాడుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో మోనాల్ ని సేవ్ చేస్తున్న బిగ్ బాస్ పై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మోనాల్ గజ్జర్ కి చాలా తక్కువ ఓట్స్ వచ్చాయనే న్యూస్ మొదలైంది. బిగ్ బాస్ విషయంలో చాలామంది చాలా రకాల పోల్స్ నిర్వహిస్తున్నారు. అందులో మోనాల్ గజ్జర్ కి చాల తక్కువ ఓట్స్ పడుతున్నాయని.. ఈ నామినేషన్స్ లో ఉన్న అవినాష్ ని సేవ్ చెయ్యడానికి అందరికన్నా ఎక్కువ ఓట్లు వేసిన ప్రేక్షకులు తర్వాత స్థానంలో అభిని నించోబెట్టారని అంటున్నారు.

ఇక తరవాత స్థానాల్లో దివి, నోయెల్, అరియనా, మోనాల్ గజ్జర్ ఉన్నారంటున్నారు. అయితే ఇక్కడ ఈసారి కూడా ఓట్స్ కి వ్యతిరేఖంగా మోనాల్ ని సేవ్ చేస్తే గనక బాగా ఆడుతున్న అరియనా ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు. చాలా ఫెయిర్ గేమ్ ఆడుతూ.. ఆటల్లో రాక్షసిలా కనబడుతూ.. అందరితో కలిసిపోతున్న అరియనా తాజాగా కెప్టెన్సీ టాస్క్ లోను అవినాష్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఎప్పుడూ అల్లరి చేస్తూ బిగ్ బాస్ ని ఎంజాయ్ చేస్తూ ఆటల విషయంలో నిజాయితీగా ఆడే అరియానని మోనాల్ కోసం బలి చేస్తే ఈసారి బిగ్ బాస్ కి మాములుగా ఉండదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. చూద్దాం మోనాల్ కోసం అరియానని బిగ్ బాస్ బలి చేస్తుందా.. లేదా.. అనేది.

Tags:    

Similar News