ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి పెరుగుతున్న క్రేజ్!!

బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నుండి ఇప్పటి వరకు ఎవరైనా ఫెయిర్ గేమ్ ఆడారంటే అది అరియానానే అంటున్నారు ఆమె అభిమానులు. మధ్యలో రెండు [more]

Update: 2020-11-14 05:30 GMT

బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నుండి ఇప్పటి వరకు ఎవరైనా ఫెయిర్ గేమ్ ఆడారంటే అది అరియానానే అంటున్నారు ఆమె అభిమానులు. మధ్యలో రెండు వారలు అరియనా కాస్త అతిగా ప్రవర్తించినా.. ఆమె మాట తీరు, గేమ్ మీద ఉన్న ఫోకస్ తో ఆమెకి రోజు రోజు కి సోషల్ మీడియాలో అభిమానుల సంఖ్య పెరిగిపోతుంది. రెండో సీజన్ లో రన్నర్ గా నిలిచిన గీత మాధురి కూడా అరియనా గేమ్ స్టయిల్ ని, ఆమె కేరెక్టర్ ని తెగ మెచ్చుకుంటుంది.అరియనా తనకి జెన్యూన్ కంటెస్టెంట్ గా అనిపిస్తుంది అని, క్యూట్ గా అవతలి వ్యక్తికీ ఏం చెప్పాలయునుకుంటుందో అది సుత్తి లేకుండా కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతుంది.

అందుకే అరియనా అంటే నాకు ఇష్టం అంటుంది. ఇక గీత మాధురి మాత్రమే కాదు.. ఇప్పుడు సోషల్ మీడియాలో అరియనా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అమ్మ రాజశేఖర్ బయటికి వెళ్ళినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న అరియనా హౌస్ మొత్తం తనని నామినేట్ చేసి బయటికి పంపాలనుకున్నా కూడా స్ట్రాంగ్ గానే ఉంది.. ఎలాంటి భయం లేకుండా షార్ప్ గా గేమ్ ఆడుతుంది అంటున్నారు నెటిజెన్స్. అరియనా గ్రాఫ్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా పెరగడంతో మిగతా కంటెస్టెంట్స్ ఇప్పుడు రిస్క్ జోన్ లోకి వెళ్ళినట్టే అంటున్నారు.

Tags:    

Similar News