ఏంటి పవన్.. రెడీనా?

హీరోలంతా షూటింగ్స్ షూటింగ్స్ అంటూ సెట్స్ మీదికెళ్లిపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుండి ఏ వార్త బయటికి రావడం లేదు. వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ షూటింగ్ [more]

Update: 2020-10-05 06:34 GMT

హీరోలంతా షూటింగ్స్ షూటింగ్స్ అంటూ సెట్స్ మీదికెళ్లిపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుండి ఏ వార్త బయటికి రావడం లేదు. వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ షూటింగ్ ని మొదలు పెట్టేసాడు. కానీ పవన్ వకీల్ సాబ్ షూట్ లో ఎప్పుడు జాయిన్ కాబోతున్నాడో తెలియదు. మరి వకీల్ సాబ్ కీ పవన్ లుక్ చేంజ్ చెయ్యాల్సిన అవసరం లేదు. లాయర్ గా క్లీన్ షేవ్ తో కాస్త బరువుగా కనిపించిన ఓకె. కానీ క్రిష్, హరీష్ సినిమాలకు పవన్ ఫిట్ నెస్ ట్రై చెయ్యాలి. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ కోసం పవన్ కళ్యణ్ తయారవుతున్నాడనే న్యూస్ ఉంది. కానీ పక్కాగా సెట్స్ మీదకెప్పుడు వేళ్తాడో క్లారిటీ లేదు. దిల్ రాజు – వేణు శ్రీరామ్ లు పవన్ రాక కోసం వెయిటింగ్.

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాడని.. త్వరలోనే కొత్త మేకోవర్ లో కొత్త లుక్ లో పవన్ ని చూడబోతున్నామనే టాక్ మొదలయ్యింది. దీక్ష విరమించాక పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టి జిమ్ చేస్తున్నాడని.. వకీల్ సాబ్ లో పెద్దగా కొత్తగా కనిపించని పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమాకి మాత్రం కొత్త లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలతో కాకుండా సినిమాల్తో బాగా బిజీ అవుతున్నాడు. రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నా పూర్తి దృష్టి మాత్రం పవన్ సినిమాలకే అన్నట్లుగా ఉన్నాడట. అందుకే సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకుని తెగ కమిట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడట.

Tags:    

Similar News