వాళ్ళు షూటింగ్స్ కి వెళ్లడం లేదని ఎవరన్నారు!!

కరోనా కారణంగా బ్రేకిచ్చిన షూటింగ్స్ మొదలైనా మళ్ళీ వాయిదా పడ్డాయి. అలాగే కరోనా భయానికి అనసూయ, సుమ లాంటి వాళ్ళు షూటింగ్స్ కి ప్యాకప్ చెప్పేసి ఇంటికెళ్లిపోయారనే [more]

Update: 2020-07-30 05:49 GMT

కరోనా కారణంగా బ్రేకిచ్చిన షూటింగ్స్ మొదలైనా మళ్ళీ వాయిదా పడ్డాయి. అలాగే కరోనా భయానికి అనసూయ, సుమ లాంటి వాళ్ళు షూటింగ్స్ కి ప్యాకప్ చెప్పేసి ఇంటికెళ్లిపోయారనే టాక్ నడిచింది. హాట్ అండ్ క్యూట్ యాంకర్స్ కూడా కరోనా కి దణ్ణం పెట్టేశారని అన్నారు. అందుకే అనసూయ జబరదాస్ కి, అలాగే జీ ఛానల్ ప్రోగ్రామ్స్ కి వెళ్లడం లేదని, సుమ చెయ్యాల్సిన క్యాష్ లాంటి ప్రోగ్రామ్స్ ని కూడా ఆపేశారని అన్నారు. కానీ వారం వారం ప్రసారం అవుతున్న షోస్ ఫ్రెషగానే వస్తున్నాయి. కాబట్టి సుమ కానీ, అనసూయ కానీ షూటింగ్స్ కి వెళ్లడం లేదనేది నిజం కాదని.. వాళ్ళు యధావిధిగానే షూటింగ్ కి వెళుతున్నారని అంటున్నారు.

అయితే మరికొంతమంది అనసూయ, సుమ వాళ్ళు చాలా ఎపిసోడ్ షూట్ చెయ్యడం వలనే.. వాళ్ళు షూటింగ్స్ కి రాకపోయినా ఇంకా ఆ లేటెస్ట్ ఎపిసోడ్స్ ని ఛానల్స్ లు ఫ్రెష్ గా ప్రసారం చేస్తున్నాయని అంటున్నారు. మరి సుమ, అనసూయ, రష్మిలు రెగ్యులర్ గా షూటింగ్స్ కి వెళ్లకుండా వారానికి రెండు మూడు రోజుల ప్రకారం షూటింగ్ కి హారవుతున్నారని, వచ్చిన రోజే తమకి కావల్సిన ఎపిసోడ్స్ షూట్ చేసుకుని స్టోర్ చేసుకుని.. వారం వారం ఫ్రెష్ ఎపిసోడ్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని టాక్. 

Tags:    

Similar News