అరవింద సమేత షూటింగ్ అప్ డేట్స్..!

Update: 2018-08-04 07:47 GMT

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అరవింద సమేత‘ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చురుగ్గా జరుగుతుంది. హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఓ దేవాలయం లో ఎన్టీఆర్ ఫై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఇంకో రెండు వారాల్లో పూర్తి కావొచ్చు. ఆ తర్వాత చిత్ర యూనిట్ సెప్టెంబర్ లో విదేశాలకు వెళ్లనుంది. అక్కడ కొన్ని పాటలు.. కొన్ని సీన్స్ చిత్రీకరిస్తారు. దాంతో సినిమా టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. ఇక ఇందులో కమెడియన్ గా సునీల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయనపై కొన్ని కామెడీ సీన్స్ కూడా షూట్ చేసారు.

ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయాల‌ని

ఇక ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నాగబాబు నటిస్తుండగా..రాజ‌కీయ నాయ‌కుడిగా రావు రమేష్ నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను ఆగస్టు 15న విడుదల చేయనున్నారని సమాచారం. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా..సంగీతం తమన్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ లో షూటింగ్ ముగించుకుని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయనున్నారు మేకర్స్.

 

Similar News