మెట్రో స్టేషన్ లో ఎన్టీఆర్..అతని గర్ల్ ఫ్రెండ్..!

Update: 2018-08-13 09:50 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్‌. రాధాకృష్ణ నిర్మాణం తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమాపై అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో.. ఇటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది 'అజ్ఞాతవాసి' సినిమాను మన ముందుకు తీసుకొచ్చిన త్రివిక్రమ్ ఎన్నో విమర్శలు అందుకున్నాడు. దీంతో ఎట్టి పరిస్థితిల్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ హిట్ కావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

లీకుల బెడద

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్ లో జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ - పూజా హెగ్డే పై కొన్ని కీలక లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గా దీనికి సంబంధించి ఫొటోస్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ చూస్తుంటే ట్రైన్‌ కరెక్ట్‌ టైమ్‌కి వస్తుందా? ఆలస్యం ఏమైనా ఉందా? అని వీర రాఘవ ఎంక్వైరీ చేస్తున్నట్టు ఉంది.

దసరా కానుకగా...

షూటింగ్ కి సంబంధించి ఫొటోస్ బయటకి రాకూడదని ఎంత ప్రయత్నించినా అవి సోషల్ మీడియాలో లీక్‌ అవ్వడం యూనిట్‌ను కలవరపెడుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న విడుదల చేయాలనుకుంటున్నారు.

Similar News