యూట్యూబ్ లో అరవింద టీజర్ హవా...!

Update: 2018-08-15 09:51 GMT

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న అరవింద సమేత టీజర్ ఈ రోజు బుధవారం ఉదయం విడుదలయ్యింది. హారిక - హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ హీరోగా అదరగొడుతున్నాడు. త్రివిక్రమ్ కామెడీని వదిలేసాడో... లేదంటే టీజర్ లో కామెడీని తప్పించాడో తెలియదు గానీ.. త్రివిక్రమ్ మార్క్ కాకుండా ఎన్టీఆర్ మార్క్ లో అరవింద సమేత టీజర్ కనబడుతుంది. మాటల మాంత్రికుడు కామెడీ సమేత డైలాగ్స్ కాకుండా ఎన్టీఆర్ సమేత మాస్ డైలాగ్స్ తో కట్ చేసిన అరవింద సమేత టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ని ఒక ఊపు ఊపేస్తోంది.

సీమ యాసలో చించేశాడు...

బ్యాగ్రౌండ్ లో జగపతిబాబు చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్.. మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా..అంటూ చెబుతుంటే.. ఎన్టీఆర్ నిజంగానే యంగ్ టైగర్ మాదిరిగానే విలన్స్ ని ఉతికి ఆరేస్తూ.. కత్తితో కస కస కోసేస్తూ.. రౌడీలను వేటాడుతుంటే.. నిజంగానే మచ్చల పులి లేడిని వేటాడినట్టుగా వుంది. అలాగే ఎన్టీఆర్ చెప్పిన రాయలసీమ పవర్ ఫుల్ యాస డైలాగ్ కంటపడ్డవా కనికరిస్తానేమో… వెంటపడ్డానా నరికేస్తా కేక పుట్టించేలా ఉంది. ఇక ఇంత పవర్ ఫుల్ టీజర్ ని యూట్యూబ్ లో వదిలింది మొదలు ఎన్టీఆర్ ఫాన్స్ షేర్స్, లైక్స్ తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

మూడు గంటల్లో 30 లక్షలు...

మరి ఈ అరవింద సమేత టీజర్ విడుదలైన మూడు గంటల్లోపే.. 30లక్షల డిజిటల్ వ్యూస్ ను రాబట్టి యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. మరి ఇదే రేంజ్ లో ఈ టీజర్ యూట్యూబ్ లో చెలరేగిపోతే... ఒక 24 గంటల్లోపే కోటి వ్యూస్ ను సొంతం చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. మరి ఈ టీజర్లో అరవింద అదేనండి.. పూజ హెగ్డే కానీ.. ఏ ఇతర ఫ్యామిలీ ఆడియెన్ కి కనెక్ట్ అయ్యే డైలాగ్ కానీ, సీన్ కానీ లేకపోయినా.. ఈ మాస్ టీజర్ కి ఈ రేంజ్ క్రేజ్ రావడం మాములు విషయం కాదు. ఎన్టీఆర్ స్టామినా.. త్రివిక్రమ్ కున్న క్రేజ్ ఈ అరవింద సామెతపై ఈ హైప్ రావడానికి కారణమని చెప్పొచ్చు.

Similar News