'అరవింద సమేత' టాక్ బన్నీకి కలిసొచ్చింది..!

Update: 2018-10-12 09:39 GMT

అల్లు అర్జున్ సినిమాను కంఫర్మ్ చేసే విషయంలో చాలా స్లోగా డెసిషన్ తీసుకుంటాడని.. త్వరగా ఏ విషయం తేల్చడని ఓ పేరు ఉంది. మిగతా హీరోలు అంతా వేగం పెంచి సినిమాల మీద సినిమాలు చేస్తుంటే బన్నీ మాత్రం చాలా గ్యాప్ తీసుకుని సినిమా చేస్తున్నాడు. అయినా అతనికి సక్సెస్ రేట్ తక్కువే. సాధారణంగా మన హీరోలు ఒక సినిమా చేస్తూనే ఇంకో సినిమాను లైన్ లో పెడుతుంటారు. కానీ బన్నీ అందుకు వ్యతిరేకం. 'నా పేరు సూర్య' సినిమా చేసి చాలా నెలలు అవుతుంది. ఇంతవరకు తన నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇవ్వలేదు.

త్వరలోనే త్రివిక్రమ్ తో సినిమా..?

త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని టాక్. అందుకోసమే ‘అరవింద సమేత’ రిజల్ట్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసాడు బన్నీ. నిజానికి బన్నీ 'మనం' డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తో ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ అతను ఎన్ని కథలు చెప్పినా బన్నీకి ఒక పట్టాన నచ్చట్లేదు. దాంతో బన్నీ త్రివిక్రమ్ వైపు కన్నేశాడు. 'అరవింద సమేత' రిలీజ్ అయ్యి హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో త్రివిక్రమ్ మళ్లీ ఫామ్ లోకి రావడంతో బన్నీ అతనితో సినిమా చేయనున్నాడు అని టాక్. బన్నీను ఇంప్రెస్స్ చేసే కథను త్రివిక్రమ్ చెప్పాడని అంటున్నారు. సో త్వరలోనే వీరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్.

Similar News