ఇక్కడే కాదు ఓవర్సీస్ లోనూ దెబ్బేసిందా...?

Update: 2018-10-18 07:20 GMT

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాబోలో తెరకెక్కిన అరవింద సమేత టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్ లోనూ అరవింద సమేత హవా కొనసాగింది. ఓవర్సీస్ లో త్రివిక్రమ్ సినిమాలకుండే క్రేజ్ మరే డైరెక్టర్స్ తీసే సినిమాలకు ఉండదు. అలాగే ఎన్టీఆర్ కూడా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ సినిమాలతో ఓవర్సీస్ మార్కెట్ ని కొల్లగొట్టడం స్టార్ట్ చేసాడు. మామూలుగానే ఓవర్సీస్ మార్కెట్లో అమెరికాలో వేసే ప్రీమియర్స్ తెలుగు సినిమాలకు అత్యంత కీలకం.

ప్రీమియర్లకు మంచి టాక్.....

ఇక అరవింద సమేత సినిమా అమెరికాలో ప్రీమియర్లకు మంచి టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. పైగా వసూళ్లు కూడా భారీగా వచ్చాయి. ప్రీమియర్స్ తోనే ఏకంగా 8 లక్షల డాలర్లు అరవింద సామేతకి వసూలయ్యాయంటే చిన్న విషయం కాదు. అదంతా చూసాక ట్రేడ్ వర్గాలు అరవింద సమేత త్రీ మిలియన్స్ మార్క్ ని ఈజీగా అందుకుంటుందనుకున్నారు. కానీ ఫస్ట్ వీకెండ్ లో అరవింద హవా కొనసాగినప్పటికీ.... సోమవారం నుండి అక్కడ అరవింద కలెక్షన్స్ డ్రాప్ కావడంతో వారాంతం ముగిసేసరికి... ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్లే వసూలు చేసింది.

అనూహ్యంగా డ్రాప్ అయ్యాయి.....?

ఇక ఈరోజు గురువారం నాటికీ 2 మిలియన్ మార్క్ ని అందుకునేలా అరవింద కనబడుతుంది అంటే... అరవిందకి ఓవర్సీస్ లోనూ దెబ్బపడిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సోమవారం నుండి అరవింద కలెక్షన్స్ అనూహ్యంగా డ్రాప్ అయ్యాయి. ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ లు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ సినిమా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇక సిటీస్ లోని మల్టిప్లెక్స్ ల్లోనే అరవింద సమేత థియేటర్స్ ఫుల్ కావడం లేదంటే బిసి సెంటర్స్ పరిస్థితి ఏమిటో మరి.. ఈ లెక్కన అరవింద సమేత సినిమాని హిట్ అనాలా లేదంటే ఏమనాలో ఇంకా తెలియని పరిస్థితే.

Similar News