ట్రైలర్ మొత్తంలో అతని పాత్రే హైలైట్ ..!

Update: 2018-10-04 08:20 GMT

మొన్న రాత్రి రిలీజ్ అయిన 'అరవింద సమేత' ట్రైలర్ ఎన్ని సెన్సషన్స్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే అందులో జగపతిబాబు గెటప్ మరో ఎత్తు. జీప్ లో కూర్చుని ముఖానికి కత్తి గాటుతో .. నోట్లో చుట్ట మాదిరిగా బుల్లెట్ పెట్టుకుని " నారప్ప రెడ్డి బిడ్డా? " అని చెప్పే చిన్న డైలాగ్ కే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

ఎన్టీఆర్ కూడా చెప్పడంతో...

దాంతో జగ్గు భాయ్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్.. జగపతిబాబు పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ జగపతిబాబు గారి పాత్ర గురించి మాట్లాడుకుంటారు అని అన్నాడు. కథానాయకుడు ఎంతటి బలవంతుడు అనే విషయం తెలియాలంటే.. అంతటి బలవంతుడైన ప్రతి నాయకుడు అవసరమని చెప్పాడు. రీసెంట్ గా 'రంగస్థలం'లోనూ ఆయన పాత్ర ఎంత హైలైట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు.

Similar News