అరవింద సమేతకు అదే ప్లస్..!

Update: 2018-10-09 07:43 GMT

ఈ నెల 11న 'అరవింద సమేత' సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో చిత్రం కాబట్టి ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తి మొదలైంది. ఈ సినిమా 11న రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందే అంటే 10న బుధవారం నుంచే ప్రీమియర్ షోల హడావుడి మొదలు కానుంది. మొదటి రోజు రికార్డ్ స్థాయి వసూళ్లు సాధ్యమేనని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వారు. అందుకు గాను టికెట్ రేట్ కూడా పెంచుతున్నారు. ఏపీలో ఈ సినిమా టికెట్ రేట్ పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం అధికారికంగా జీవో ఇవ్వనుందని తెలుస్తోంది.

తొలి వారంలోనే వచ్చేస్తాయా..?

ఈ నెల 11 నుండి 19 వరకు టికెట్ రేట్లను పెంచుకుని విక్రయించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. సింగిల్ స్క్రీన్స్ లో టిక్కెట్టు ధర రూ.150 ఉంటే నగరాల్లో రూ.200 ఉండే అవకాశం ఉంది. కాబట్టి తొలి రోజుతో పాటు తొలి వారం వసూళ్ల రికార్డులకు ఛాన్స్ ఉంటుంది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల మీద క్రేజ్ తో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 93 కోట్లకు అమ్ముడైంది. కేవలం ఏపీలో 35కోట్ల బిజినెస్ చేసింది. తొలివారంలోనే రికవరీ మొత్తం చేయాల్సి ఉంటుంది. ఓవర్సీస్ లో కూడా ముందే హాఫ్ రేటుకే టికెట్స్ అమ్ముడైపోవడంతో ఈ సినిమాకు కలిసొస్తోందట. మరి ఈ సినిమా ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Similar News