అరవింద ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండూ..!

Update: 2018-10-10 07:12 GMT

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ అయ్యింది. మరికొన్ని గంటల్లోనే ప్రీమియర్స్ తో హడావుడి స్టార్ట్ చెయ్యబోతున్న అరవింద సమేత మీద బోలెడన్ని అంచనాలున్నాయి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీమ యాస హైలెట్ గా నిలుస్తుందనే టాక్ మొదటి నుండి వినబడుతుంది. ఇక రాయలసీమ యాసను ఎన్టీఆర్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో మాట్లాడడట. ఇక కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు అరవింద సమేత విలన్ కేరెక్టర్ చేస్తున్న జగపతి బాబు కూడా రాయలసీమ స్లాంగ్ దంచేసాడట. ఇకపోతే మంగళవారం అరవింద సామెత సెన్సార్ టాక్.. సెన్సార్ రివ్యూస్ అంటూ అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

ఫస్ట్ హాఫ్ కూడా అదుర్స్ అంట...

ఆ వార్తల సారాంశం బట్టి అరవింద సమేత ఫస్ట్ హాఫ్ కామెడీతో యావరేజ్ అని.. సెకండ్ హాఫ్ జగపతి బాబు, ఎన్టీఆర్ ల మధ్యన జరిగే యాక్షన్ తో పాటుగా.. ఫ్యామిలీ నేపథ్యంలో జరిగే ఎమోషన్స్ ని త్రివిక్రమ్ అదరగొట్టాడని అన్నారు. అంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్ - సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అంటూ ఆ వార్తల సారాంశం. తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అరవింద ఫస్ట్ హాఫ్ కూడా అదుర్స్ అని.. ఫస్ట్ హాఫ్ లో కామెడీతో మేనేజ్ చేసిన త్రివిక్రమ్ సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ, బంధాలు అనుబంధాలతో... సినిమా మొత్తం ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ మనసులకు హత్తుకుపోయేలా తెరకెక్కించాడని అంటున్నారు.

ఎన్టీఆర్ నటన హైలెట్...

సినిమాలో కామెడీకి కాస్త చోటు తక్కువిచ్చినా ఎమోషన్స్ తోనే సినిమాని త్రివిక్రమ్ ఎక్కడికో తీసుకెళ్లాడని ఇక విలన్ గా జగపతి బాబు అదరగొట్టాడని, ఎవరి కేరెక్టర్స్ లో వాళ్లు బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసారని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ చెప్పినట్టు ఎన్టీఆర్ నటన ఈ సినిమాకే హైలెట్ అనేలా ఉంటుందని... నిజంగానే కొత్త ఎన్టీఆర్ ని చూస్తామని అంటున్నారు. మరి సెన్సార్ తో సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ రికార్డులు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్.

Similar News