అరవింద ఫంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్..!

Update: 2018-10-03 08:38 GMT

నిన్న జరిగిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఏడుస్తూ మాట్లాడం.. చూసిన ప్రేక్షకులు కూడా ఏడిచేసారు. కళ్యాణ్ రామ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఈవెంట్ కు చాలామంది అతిధులు వచ్చారు. కానీ అందరి కళ్లూ రాజమౌళి కొడుకు కార్తికేయ మీదే పడ్డాయి. ఈ ఈవెంట్ కి అతను తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వచ్చాడు. దాంతో అందరి చూపులు ఆ జంటపై పడింది. ఆమె జగపతిబాబుకి అన్నయ్య కూతురు. ఆమె పేరు పూజ. వీరిద్దరూ కలిసి జంటగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ అటెన్షన్ అంతా తమవైపు తిప్పుకున్నారు. రీసెంట్ గా ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతుంది.

రాజమౌళి బదులు...

రాజమౌళి ఫామిలీ అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. వీరు ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటారని తెలిసిన విషయమే. ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్స్ కు జక్కన్న ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు కచ్చితంగా హాజరవుతారు. అయితే ఈసారి రాజమౌళికి బదులు పూజ - కార్తికేయ జంట ఆ బాధ్యత తీసుకుంది. ఈ జోడి ఫంక్షన్ ఆలా కనపడేపాటికి జంట బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.

Similar News