అరవింద సమేత ఫస్ట్ టాక్..!

Update: 2018-10-09 06:47 GMT

అరవింద సమేత వీర రాఘవ సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల టైమే మిగిలింది. రేపు గురువారం దసరా సెలవులను క్యాష్ చేసుకోవడానికి.. ముందుగా బరిలోకి దిగుతున్న భారీ బడ్జెట్ మూవీ ఈ అరవింద సమేత. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రామ్ చరణ్ రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ అంతే అంచనాలతో అంతే భారీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత నాలుగైదు నెలల నుండి భారీ బడ్జెట్ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ అరవింద కనువిందు చేయబోతుంది.

ఫస్ట్ హాఫ్ యావరేజ్... సెకండ్ హాఫ్ సూపర్

ఇక భారీ అంచనాలతో పాటు నిన్న జారీ చేసిన సెన్సార్ టాక్ తో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అరవింద సమేతని వీక్షించిన సెన్సార్ సభ్యులు అరవింద సమేతకి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని.. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని విశ్వనీయ సమాచారం. అంటే ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ టాక్ పడడం ఖాయమనే మాట వినబడుతుంది. ఇక సినిమా రన్ టైం కూడా లాక్ చేశారు. ఈ సినిమాకి నిడివి 161నిమిషాల 30సెకండ్ల (2గంటల 41 నిమిషాలు) రన్ టైమ్‌ గా లాక్ చేశారట.

Similar News