ఫైట్ సీన్ వద్దన్నా ఎన్టీఆర్

Update: 2018-06-05 12:16 GMT

మాస్ తో పాటు క్లాస్ ప్రేక్షకులని మెప్పించగల సినిమాలు తీయడంలో త్రివిక్రమ్ స్టయిలే వేరు. సినిమా మొత్తం క్లాస్ గా అనిపించినా మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్ కి మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యిపోతారు. త్రివిక్రమ్ సినిమాల్లో ఫైట్స్ చాలా కొత్తగా ఉంటాయి. తన ఫైట్స్ లాజికల్ గా ఉంటాయి. అందుకే త్రివిక్రమ్ కు మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

కళ్లజోడు లాంటిదే మళ్లీ...

ప్రస్తుతం ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా తన స్టైల్ లో ఓ ఫైట్ సీన్ ని ప్లాన్ చేసాడంట త్రివిక్రమ్. కానీ ఆ ఫైట్ సీన్ ను ఎన్టీఆర్ క్యాన్సిల్ చేసినట్టు సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో కళ్ళజోడుకి సంబంధించి ఓ ఫైట్ సీన్ ఉంటుంది అది సినిమాకే హైలైట్ గా నిలిచింది.

కొత్తది ప్లాన్ చేయమన్న ఎన్టీఆర్...

అయితే కొంచెం దగ్గరగా 'అరవింద సమేత'లో కూడా అటువంటి ఫైట్ సీన్ ఒకటి ప్లాన్ చేసాడంట త్రివిక్రమ్. వెరైటీగా అనిపించడంతో.. మొదట ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పాడంట. కానీ తర్వాత వద్దు అని చెప్పేశాడట. ఈ ఫైట్ సీన్ ఆన్ స్క్రీన్ పై చూస్తే...'అత్తారింటికి దారేది' ఫైట్ గుర్తుకొచ్చే అవకాశం ఉందని.. అందుకే ఈ సీక్వెన్స్ వద్దని.. వేరేది డిజైన్ చేయమని చెప్పాడట జూనియర్. ఎన్టీఆర్ ఆలా చెప్పడంతో డైరెక్టర్ త్రివిక్రమ్ ఏమి ఆలోచించకుండా వేరే ఫైట్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

Similar News