అరవింద సమేత రికార్డులు చూసారా..!

Update: 2018-10-15 06:12 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కి దసరా సెలవుల కానుకగా గురువారం విడుదలైన అరవింద సమేత వీరరాఘవ సినిమా థియేటర్స్ లో దుమ్ము దులుపుతుంది. ఎన్టీఆర్ - పూజ హెగ్డే జంటగా నటించిన అరవింద సమేత రాయలసీమ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కి హిట్ అయ్యింది. మొదటి షోకి మిక్స్డ్ టాకొచ్చినప్పటికీ ఈవెనింగ్ కల్లా ఎన్టీఆర్ అరవింద సమేతకి మంచి టాక్ రావడంతో కలెక్షన్స్ ఊపందుకున్నాయి. ఎన్టీఆర్ అభిమానులైతే అరవింద సమేత సినిమా హిట్ తో పార్టీలు చేసుకున్నారు.

కొత్త రికార్డు సృష్టించిన అరవింద

అరవిందగా నటించిన పూజ హెగ్డే కి నార్మల్ మార్కులు పడగా ఎన్టీఆర్ నటనకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. అలాగే విలన్ జగపతి బాబు పాత్రకి ఎన్టీఆర్ తో సమానమైన ఆదరణ దక్కింది. జగపతి బాబు విలనిజాన్ని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం నాన్ బాహుబలి రికార్డులను సృష్టిస్తున్న అరవింద సమేత ఇప్పుడు మరో రికార్డు కొల్లగొట్టినట్టు చిత్ర బృందం చెబుతుంది. తొలి వారాంతంలోనే రూ.100 కోట్లు(గ్రాస్) వసూలు చేసినట్టు చెబుతుంది. ఇక వారాంతానికి అరవింద రికార్డులిలా ఉంటె ఇంకా సినిమాకి 18వ తేదీ వరకు పోటీలేని లేదు. మరి ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులకు చెరువుతుంది అంటున్నారు. ఎన్టీఆర్ స్టామినా, త్రివిక్రమ్ క్రేజ్ అన్నీ కలిపి సినిమాని సూపర్ హిట్ చేశాయి.

Similar News