ప్రీమియర్స్ తోనే వేట మొదలెట్టేసిందా..!

Update: 2018-10-11 07:07 GMT

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రమైన ఏపీలో ఉదయం ఐదు గంటల నుండే బెన్ఫిట్ షో అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ హడావిడి థియేటర్స్ దగ్గర మాములుగా లేదు. ఎన్టీఆర్ ఫాన్స్ అరవింద సమేత హిట్ అంటూ హడావిడి చేస్తూ సినిమా మీద క్రేజ్ పెంచేస్తున్నారు. ఇక అరవింద హడావిడి ఓవర్సీస్ లోనూ పిచ్చెక్కిస్తుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా 200 స్క్రీన్స్ లో పైగా ప్రీమియర్స్ వేశారు. అమెరికాలో నిన్న రాత్రి 8 గంటల వరకూ 194 లొకేషన్స్ లో వేసిన ప్రీమియర్ షోలతో వలన $707,698 వసూళ్లు వచ్చాయి. ఇక మిగతా లొకేషన్స్ వసూళ్లు కలుపుకుంటే కేవలం ప్రీమియర్ షోలతోనే అరవింద సమేత 1 మిలియన్ మార్క్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రీమియర్ షోలతోనే...

మరి ఇలా ప్రీమియర్స్ తోనే రచ్చ మొదలెట్టేసిన అరవింద సమేత కి తెలుగు రాష్ట్రాల్లోనూ మాంచి హడావిడే ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్ మీద అంచనాలు, ఎన్టీఆర్ నట విశ్వరూపం, పూజ హెగ్డే గ్లామర్ అన్ని ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచేసాయి. ఉదయం బెన్ఫిట్ షో, ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ప్రకారం అరవింద సమేత సినిమా హిట్ టాక్ అయితే పడింది. మరి పూర్తి టాక్ తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు వెయిట్ చేస్తే తేలిపోతుంది.

Similar News