అరవిందకి అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయ్..!

Update: 2018-10-10 09:42 GMT

గత నాలుగు వారాలుగా థియేటర్స్ లో సరైన సినిమానే లేదు. గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత సమంత యూ-టర్న్ హిట్ అయినా.. ఆ సినిమా మల్టిప్లెక్స్ లకే పరిమితమైంది. అందుకే యూ-టర్న్ సినిమాకి కలెక్షన్స్ రాలేదు. ఇక దేవదాస్ తో కాస్త హైప్ లేపుతారనుకున్న నాగార్జున - నాని సినిమాకి యావరేజ్ టాక్ తో విజయ్ దేవరకొండ నోటాకి దారిచ్చారు. ఇక భారీ అంచనాలు... గీత గోవిందం క్రేజ్ తో విడుదలైన నోటా సినిమా కూడా యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకోవడంతో సినిమా లవర్స్ అంతా మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా లవర్స్ కి ఇప్పుడు ఏకైక ఆప్షన్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ. ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వారం మాత్రం ఖాయం...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజ్, జై లవ కుశ హిట్ తో జోష్ లో ఉన్న ఎన్టీఆర్, గ్లామర్ భామ పూజ హెగ్డే, రంగస్థలంలో ప్రెసిడెంట్ ఫణింద్ర భూపతిగా ఇరగదీసిన జగపతి బాబు ఇలా సినిమాకి అన్ని ప్లస్ పాయింట్స్ కనబడుతున్నాయి. ఇక ఎలాగూ సెన్సార్ టాక్ కూడా అరవింద సమేతకి అనుకూలంగా ఉండడం.. సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుడు ఈ దసరా సెలవల్లో అరవింద సమేత లాంటి సినిమా చూడాలని డిసైడ్ అవడంతో.. అరవింద ప్రీ బుకింగ్స్ కూడా అదరగొట్టేస్తున్నాయి. మరి సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా ఒక వారం పాటు అరవింద కలెక్షన్స్ కొల్లగొట్టడం మాత్రం ఖాయం. సినిమాకి నెగెటివ్ టాకొచ్చిందా వారం రోజుల పాటు కలెక్షన్స్ డ్రాప్ అవడం జరిగే పని కాదు. ఇక హిట్ అయ్యిందా రెండు వారాల పాటు అరవిందని అందుకోవడం ఎవరి తరం కాదు.

రెండు సినిమాలు వస్తున్నా...

ఇక అరవింద సమేత ఏది చేసిన ఒక వారంలోపే చెయ్యాలనే రూలేం లేదు. ఎందుకంటే దసరా కానుకగా దిల్ రాజు నిర్మాతగా రామ్ - అనుపమ పరమేశ్వరన్ ల హలో గురు ప్రేమ కోసమే, విశాల్ పందెం కోడి 2 సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి. విశాల్ పందెం కోడి 2 సినిమాకి ఎంతగా అంచనాలున్నప్పటికీ.. అది ఒక డబ్బింగ్ సినిమానే. అలాగే ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న రామ్, అనుపమ పరమేశ్వరన్, దిల్ రాజు కాంబోలో వస్తున్న హలో గురు ప్రేమ కోసమే సినిమాకి కూడా ఓ అన్నంత అంచనాలు లేకపోవడం కూడా అరవింద కి కలిసొచ్చే అంశం. మరి అరవింద సమేత తో ఎన్టీఆర్ సోలోగా రెండు వారాల పాటు దున్నేయ్యొచ్చన్నమాట.

Similar News