వసూళ్లలో అరవింద కొత్త రికార్డు

Update: 2018-10-16 07:20 GMT

ఎన్టీఆర్ - పూజ హెగ్డే కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈనెల 11న అరవింద సమేత ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా అదే విధంగా వసూల్ చేస్తుంది. 5 రోజులు గానూ ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డు ని క్రియేట్ చేసింది. అంతకముందు రంగస్థలం 5 రోజుల్లో 50.10 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు అరవింద సమేత రంగస్థలంని బీట్ చేసి 52.67 కోట్లు వసూల్ చేసింది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం 52.67 కోట్లు వసూల్ చేసింది. ఏరియా వైజ్ వివరాలు మీకోసం..

ఏరియా షేర్స్ (కోట్లు)

నిజాం 15.03

సీడెడ్ 11.82

నెల్లూరు 1.96

కృష్ణ 3.78

గుంటూరు 6.35

వైజాగ్ 5.92

ఈస్ట్ గోదావరి 4.29

వెస్ట్ గోదావరి 3.52

ఏపీ మరియు తెలంగాణ 52.67

Similar News