'అర‌వింద స‌మేత - వీర రాఘ‌వ్' ఫ‌స్ట్ లుక్ రివ్యూ

Update: 2018-05-19 11:53 GMT

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సినిమా టైటిల్ ఎట్ట‌కేల‌కు ఊరించి ఊరించి ఈ రోజు (శ‌నివారం ) సాయంత్రం రిలీజ్ చేశారు. ముందు చెప్పిన‌ట్టుగానే క‌రెక్టుగా సాయంత్రం 4.50 గంట‌ల‌కు టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ రివీల్ అయ్యింది. ఈ సినిమాకు ముందు నుంచీ రాఘ‌వ‌, అర‌వింద్, అస‌మాన్యుడు ఇలా ర‌క‌ర‌కాల టైటిల్స్ ప్రచారంలోకి వ‌చ్చాయి. ఈ టైటిల్స్ ను కాద‌ని ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు భిన్నంగా టైటిల్ ఉంది.

త్రివిక్రమ్ మార్క్ కి భిన్నంగా...

అర‌వింద స‌మేత అనే టైటిల్‌ను ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టుకు పెట్టారు. అర‌వింద స‌మేత ఈ టైటిల్‌కు కింద శీర్షిక‌గా వీర రాఘ‌వ్ అని ఫిక్స్ చేశారు. అర‌వింద స‌మేత - వీర రాఘ‌వ్ ఫైన‌ల్ టైటిల్‌. ఇక ఫ‌స్ట్ లుక్‌లో ఎన్టీఆర్ సిక్స్ ఫ్యాక్ లుక్‌తో క‌నిపించాడు. త్రివిక్ర‌మ్ సినిమాలు అంటే స‌హ‌జంగానే ముందుగా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ అని అనుకుంటాం. అయితే ఫ‌స్ట్ లుక్‌లో ఎన్టీఆర్ సిక్స్ ఫ్యాక్ బాడీతో క‌నిపిస్తూ క‌త్తి ప‌ట్టుకుని వ‌స్తుంటాడు.

హీరోయిన్ రోల్ కు ప్రధాన్యం...

ఓ యాక్ష‌న్ సీన్‌లో సీన్‌నే ఫ‌స్ట్ లుక్‌కు క‌ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. సినిమాలో ఫ్యామిలీ అంశాల‌తో పాటు యాక్ష‌న్‌కు కూడా బాగా స్కోప్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక హీరోయిన్ రోల్‌కు కూడా బాగా ప్రాధాన్యం ఉంద‌ని టైటిల్ చెప్ప‌క‌నే చెప్పింది. అర‌వింద హీరోయిన్ రోల్ అయితే అర‌వింద స‌మేతుడు అయిన‌ వీర రాఘ‌వ్ అనేది హీరో రోల్‌గా తెలుస్తోంది. సినిమాలో స‌గం క‌థ హీరోయిన్ చుట్టూనే తిరుగుతుండ‌డంతో టైటిల్‌లో ఆమె పేరు కూడా మిక్స్ చేశారు.

హిట్ దక్కేనా...

ఏదేమైనా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌, ఎన్టీఆర్ స్టైల్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింద‌నే చెప్పాలి. ఇక హీరోయిన్ కోసం హీరో విదేశాల నుంచి వ‌చ్చి ఇక్క‌డ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆమె కోసం ఏం చేశాడు అన్న‌దే క‌థ లైన్ అని స‌మాచారం. ఏదేమైనా త్రివిక్ర‌మ్ మార్క్ మ్యాజిక్ ఎలా రిపీట్ చేస్తాడో ? చూడాలి. అజ్ఞాత‌వాసి ఫ్లాప్ త‌ర్వాత క‌సితో ఉన్న త్రివిక్ర‌మ్ ఈ అర‌వింద స‌మేత రాఘ‌వ‌ను ఎలా హిట్ చేస్తాడో ?

Similar News