అరవింద సమేత ఫస్ట్ డే కలెక్షన్స్..!

Update: 2018-10-12 07:18 GMT

జై లవ కుశ హిట్ తో ఉన్న ఎన్టీఆర్ ఈసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత లో నటించాడు. నిజంగా ఎన్టీఆర్ విశ్వరూపాన్ని త్రివిక్రమ్ ఈ సినిమాలో మరోమారు ప్రేక్షకులకు చూపించాడు. వీర రాఘవుడిగా ఎన్టీఆర్ చెలరేగిపోయాడు. హీరోయిన్ పూజా హెగ్డే కి అంతంత మాత్రం పేరొచ్చినప్పటికీ... జగపతి బాబు, నవీన్ చంద్రకి ఈ సినిమాలో మంచి పేరొచ్చింది. ఇక థమన్ నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ అన్ని సినిమాకి ప్లస్ గా మిగిలాయి. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్, త్రివిక్రమ్ డైలాగ్ పవర్ కి అరవింద సమేత సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలెక్ట్ చేసింది.

ఏరియా షేర్స్ (కోట్లు)

నైజాం 5.73

సీడెడ్ 5.48

నెల్లూరు 1.06

కృష్ణ 1.97

గుంటూరు 4.14

వైజాగ్ 3.12

ఈస్ట్ గోదావరి 2.77

వెస్ట్ గోదావరి 2.37

టోటల్ ఏపీ & టీఎస్ 26.64

Similar News