అరవింద సమేత అక్కడ ఫెయిల్ అయ్యింది..!

Update: 2018-10-30 06:11 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన భారీ చిత్రం 'అరవింద సమేత' దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరు కొనసాగిస్తూ.. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల షేర్ ని రాబట్టింది. దీంతో ఈ సినిమా 100 కోట్లు క్లబ్ లో చేరి రికార్డు సాధించింది. ఇది ఇలా ఉండగా అమెరికా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. అమెరికాలో బ్రేక్ ఈవెన్ కావడానికి 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించాల్సి ఉండగా 2.17 మిలియన్ డాలర్లు మాత్రమే సాధించింది. చివరి వీకెండ్ లో 23 వేల డాలర్ల కలెక్షన్ నమోదు చేసిందని సమాచారం.

రెండు సినిమాలూ నష్టాలే...

అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్లు.. ఓపెనింగ్ తో భారీగా కలెక్షన్స్ నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద జోరు చూపించింది కానీ ఆ తరువాత డల్ అయింది. ఇంకా అప్పటి నుండి పెద్దగా పికప్ కాలేదు. దానికి కారణం త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడమే. త్రివిక్రమ్ లాస్ట్ మూడు సినిమాలు అక్కడ 2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసాయి. అయితే అందులో 'అ ఆ' మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిపెట్టాయి. మిగిలిన రెండు సినిమాలు నష్టాలు తెచ్చిపెట్టాయి. అరవిందతో నష్టాలు వచ్చినప్పటికీ మరీ భరించలేనంత కాదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

Similar News