అరవింద సమేత టీజర్ డేట్ ఇవ్వడం వెనుక అంతుందా?!

Update: 2018-08-10 06:45 GMT

ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు ఎప్పుడు విడుదల చేస్తారో ఒక్కొక్కటిగా తమ తమ డేట్స్ ని రివీల్ చేస్తున్నారు. రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల తర్వాత ఇంతవరకు భారీ బడ్జెట్ ఉన్న చిత్రమేది బాక్సాఫీసు వద్దకు రాలేదు. ఇక పెద్ద సినిమాల పండగ దసరా. వచ్చే దసరాకి ఇప్పుడొక పెద్ద ప్రాజెక్ట్ తన డేట్ ని కన్ఫర్మ్ చేసుకుంది. మొదటి నుండి చెబుతున్నట్టుగానే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా అరవింద సామెత వీర రాఘవ ని దసరా బరిలో నిలుపుతున్నారు. సినిమా మొదలైన కొన్ని రోజులకే ఫస్ట్ లుక్ తో పాటు చిన్నపాటి మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన అరవింద చిత్ర బృందం ఫస్ట్ లుక్ టీజర్ ని అలాగే.. సినిమా విడుదల తేదీలను ప్రకటించింది.

మహేష్ కి పోటీగా ఎందుకనీ...

అయితే ఇలా అనుకోకుండా ఎన్టీఆర్, త్రివిక్రమ్ లు అరవింద సమేత కి సంబంధించిన రెండు ప్రధాన విషయాలను రివీల్ చేయలేదట. ఎప్పుడో పదిహేను రోజుల క్రితమే వారు తమ సినిమా టీజర్, మూవీ రిలీజ్ డేట్స్ ఆగస్టు 9నే చెబుదామనుకున్నారట. కానీ మహేష్ బాబు బర్త్ డే రోజు అతని 25 మూవీ ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ కూడా విడుదల చేస్తుండడంతో.. సోషల్ మీడియా ఫోకస్ మొత్తం మహేష్ మీదే ఉంటుంది. అలా మహేష్ 25 మూవీ మహర్షి అనుకున్నట్లుగానే టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మహేష్ టీజర్ బయటికొచ్చే టైం లోనే తన ఫాన్స్ ని తన వైపుకు తిప్పుకుని తన సినిమా రిలీజ్ డేట్, టీజర్ ఇస్తున్నామని హింట్ వదిలితే... సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా వీర లెవల్లో ఉంటుంది. అలాంటి టైం లో మహేష్ బాబు తన టీజర్ వదిలితే ఎన్టీఆర్ ఫాన్స్ తమ అభిమాన హీరో సినిమా టీజర్ విషయమై హంగామాతో ట్రేండింగ్ ట్రేండింగ్ అంటూ హోరెత్తిస్తారు... మరి సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానుల రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది.. ఇలాంటి టైం లో మహేష్ ని ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ తన సినిమా కి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఆగస్టు 9 మహేష్ పుట్టిన రోజు సాయంత్రానికి రివీల్ చేసేటట్టు ప్లాన్ చేసినట్టుగా ఒక న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

మహేష్ హడావుడి ముగిసాకనే...!

ఇక ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపులకు ఎన్టీఆర్ నిర్మాతలు పండగ లాంటి వార్త చెప్పేసారు. అరవింద సమేత సినిమా టీజర్ ఆగస్టు 15 న వస్తుందని.. సినిమా అక్టోబర్ 11 విడుదలవుతుందనే శుభవార్తను అరవింద నిర్మాతలు హాసిని - హారిక వారు ప్రకటించారు. మరి మహేష్ బాబు అభిమానుల పండగను ఒక దారికి తెచ్చాకే తన సినిమా టీజర్ డేట్ ని వదలడం అనేది మహేష్ తో తన దోస్తీని ఎన్టీఆర్ మరోసారి చాటి చెప్పాడంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ ఒక రేంజ్ లో రచ్చ చేస్తున్నారు.

Similar News