అరవింద ఫైనల్ కలెక్షన్స్..!

Update: 2018-11-06 07:40 GMT

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత - వీర రాఘవ విడుదలై 25 రోజులైంది. గత నెల 11న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా.. మొదట్లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మెళ్లిగా పుంజుకుంది. పూజ హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో బసిరెడ్డిగా జగపతి బాబు విలనిజం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ అరవింద సమేత ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన వసూళ్లు చూస్తే బయ్యర్లు కొద్దిగా నష్టాల బారిన పడినట్లే కనబడుతుంది. కోట్లలో కాకపోయినా లక్షల్లో బయ్యర్లు నష్టపోయే ఉంటారు. మరి అరవింద సమేత వరల్డ్ వైడ్ గా ఫైనల్ రన్ లో ఎంత వసూలు చేసింది అంటే...

ఏరియా షేర్స్(కోట్లలో)

నైజాం 19.40

సీడెడ్ 13.50

వైజాగ్ 7.70

కృష్ణా 4.69

గుంటూరు 7.18

ఈస్ట్ గోదావరి 5.10

వెస్ట్ గోదావరి 4.50

నెల్లూరు 2.77

కర్ణాటక 8.00

ఓవర్సీస్ 8.00

ఇతర ప్రాంతాలు 4.50

ప్రపంచవ్యాప్త షేర్ 85.34కోట్ల

Similar News