అరవింద సమేత కి స్టార్ట్ అయ్యిందా..?

Update: 2018-10-16 07:46 GMT

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ టాక్ తో సంబంధం లేకుండా వారాంతం వరకు వసూళ్ల వర్షం కురిపించింది. అరవింద సమేత కి మిక్స్డ్ టాకొచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది. అయితే సినిమాకి మిక్స్డ్ టాకొచ్చినా సెలవుల్లో సరైన సినిమా లేకపోవడం, ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండడంతో సినిమాకి కలెక్షన్స్ బాగా వచ్చాయి. అందులోనూ మాస్ లో ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ వలన సినిమాకి టాక్ అంతంతమాత్రం ఉన్నప్పటికీ మొదటి నాలుగు రోజులు కలెక్షన్స్ అదిరిపోయాయి. అయితే ఏ సినిమాకైనా మొదటి వారాంతం సినిమా కలెక్షన్స్ బాగానే ఉంటాయి. అదే బ్లాక్ బస్టర్ గానీ, సూపర్ హిట్ టాక్ గానీ వస్తే ఫస్ట్ వీక్ మొత్తం సినిమా కి ఫుల్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. కానీ సినిమాకి టాక్ కొద్దిగా యావరేజ్ పడినా మొదటి వారం కలెక్షన్స్ వీక్ అవడంతో పాటు మిడిల్ కలెక్షన్స్ డ్రాప్ అవడం చాలా సహజం. ఇక అరవింద సమేతకి మొదటి నాలుగు రోజుల కలెక్షన్స్ బాగున్నప్పటికీ సోమవారం నుండి కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నట్టుగా కనబడ్డాయి.

రెండు సినిమాలు వస్తుండటంతో...

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ అరవింద కలెక్షన్స్ సోమవారం కాస్త డ్రాప్ అయ్యాయంటున్నారు. ఇక ఆదివారం సాయంత్రం స్టార్ మాలో ప్రసారమైన రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం సినిమా వలన అరవింద సమేత ఫస్ట్ షోకి కాస్త కలెక్షన్స్ పడిపోయి థియేటర్స్ సగం మాత్రమే నిండాయంటున్నారు. అయితే నిన్న సోమవారం అరవింద లెక్కలు తారుమారయినా.. ఇది సెలవలు సీజన్ కాబట్టి మళ్లీ ఈ రోజు మంగళవారం సినిమాకి కలెక్షన్స్ నిలదొక్కుకునే అవకాశం ఉందంటున్నారు. ఇకపోతే రేపు గురువారం మరో రెండు సినిమాలు థియేటర్స్ లో దిగుతున్నాయి. రామ్ హలో గురు ప్రేమకోసమే, విశాల్ పందెం కోడి 2 సినిమాల్లో ఏది హిట్ అయినా అరవింద సమేతకి గండం ముంచుకొచ్చినట్లే. చూద్దాం.. అరవింద సమేత అదృష్టం ఈ వారం ఎలా వుండబోతుందో అనేది.

Similar News